క‌రివేపాకుల‌తో క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజనాలు..!

భార‌త‌దేశంలో క‌రివేపాకులు చాలా పాపుల‌ర్‌. వీటిని నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. క‌రివేపాకుల‌ను కూర‌ల్లో వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. క‌రివేపాకుల‌తో కొంద‌రు నేరుగా కారం పొడి వంటివి చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి ఈ ఆకుల‌ను కొంద‌రు కూర‌ల్లోంచి తీసిప‌డేస్తారు. కానీ వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌రివేపాకుల‌తో త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు క‌రివేపాకుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం … Read more

విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం.. రెండింటికీ యాపిల్ పండు ఔష‌ధ‌మే.. ఎలాగంటే..?

రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు.. అనే సామెత అంద‌రికీ తెలిసిందే. అయితే అది నిజ‌మే. ఎందుకంటే.. యాపిల్ పండ్ల‌లో అంత‌టి అసాధార‌ణ పోష‌క విలువ‌లు ఉంటాయి. అవి అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. యాపిల్ పండ్ల‌లో చాలా త‌క్కువ క్యాల‌రీలు ఉండ‌డ‌మే కాదు.. వాటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అయితే యాపిల్ పండు రెండు ర‌కాల అనారోగ్య‌ల … Read more

రోజూ బాదంప‌ప్పు తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుందా ?

చిన్నారుల‌కు త‌మ త‌ల్లితండ్రులు నిత్యం బాదంప‌ప్పును తినిపిస్తుంటారు. నిత్యం 5 నుంచి 6 బాదం ప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి ఆ బాదంప‌ప్పును తినిపిస్తారు. నీటిలో నానే ఆ బాదంప‌ప్పుల పొట్టు తీసి వారు త‌మ పిల్ల‌ల‌కు పెడ‌తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని, మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. అయితే ఇది నిజ‌మేనా ? దీనిపై సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు ఏమంటున్నాయి ? వైద్య … Read more

కాళ్ల నొప్పులు ఉన్నాయా ? ఈ 8 స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలను పాటించి చూడండి..

సాధారణంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు, క్రీడలు ఆడినప్పుడు సహజంగానే ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గుతాయి. అయితే కొందరికి ఆ రకమైన పనులు చేసినప్పుడు కాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. అలాగే కొందరికి పోషకాహార లోపం, అసౌక‌ర్య‌వంత‌మైన‌ పాదరక్షలు ధరించడం, ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి కారణాల వల్ల కూడా పాదాల నొప్పులు వస్తుంటాయి. అయితే ఈ నొప్పులను కింద తెలిపిన ప‌లు సహజసిద్ధమైన చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు. అందుకు … Read more

50 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి.. ఎందుకంటే..?

సాధార‌ణంగా యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారి క‌న్నా 50 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారిలో మెట‌బాలిజం మంద‌గిస్తుంది. అంటే శ‌రీరం క్యాల‌రీలను త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది. ఈ విష‌యాన్ని బ్రిటిష్ న్యూట్రిష‌న్ ఫౌండేష‌న్ వెల్ల‌డించింది. అయితే క్యాల‌రీల‌ను శ‌రీరం త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది క‌నుక నిత్యం త‌క్కువ క్యాల‌రీల‌ను అందించే ఆహారాల‌నే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఎక్కువ‌గా హైబీపీ, గుండె జ‌బ్బులు, … Read more

చ‌లికాలంలో వెచ్చ‌గా ఉండేందుకు మ‌సాలా గ్రీన్ టీ.. ఇలా చేసుకోవ‌చ్చు..

గ్రీన్ టీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు దీన్ని టేస్ట్ కోసం తాగుతారు. ఇంకొంద‌రు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డం కోసం తాగుతారు. అయితే చ‌లికాలం నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. కొంద‌రు శ‌రీరం వెచ్చ‌ద‌నం కోసం ప‌లు ప్ర‌త్యేక‌మైన ప‌దార్థాల‌ను తీసుకుంటున్నారు. కానీ గ్రీన్ టీతో మ‌సాలా గ్రీన్ టీ త‌యారు చేసుకుని తాగితే దాంతో శ‌రీరానికి బాగా వెచ్చ‌దనం ల‌భిస్తుంది. మరి … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను అస్స‌లు తిన‌రాదు..!

ఆలుగ‌డ్డ‌లను చాలా మంది త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. వాటితో కొంద‌రు వేపుళ్లు చేసుకుంటారు. కొంద‌రు ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. ఇంకొంద‌రు కిచిడీ వంటి వాటిల్లో వేస్తుంటారు. అయితే సాధార‌ణంగా చాలా మంది వీటిని త‌ర‌చూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తుంటారు. కానీ కింద తెలిపిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం బంగాళాదుంప‌ల‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. గ్యాస్‌, అసిడిటీ గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు బంగాళాదుంప‌ల‌ను తిన‌రాదు. తింటే ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. వీటిని తిన‌డం … Read more

కిడ్నీ స్టోన్స్‌ను స‌హ‌జ సిద్ధంగా తొల‌గించుకునేందుకు 5 అద్భుత‌మైన చిట్కాలు

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉంటే ఎవ‌రికైనా స‌రే పొత్తి క‌డుపులో విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంటుంది. ఏ ప‌ని చేద్దామ‌న్నా నొప్పి తీవ్రంగా ఉంటుంది. దీంతో అస‌లు మ‌న‌స్క‌రించ‌దు. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారిలో వెన్ను భాగంలో కింద వైపు లేదా పొత్తి క‌డుపులో లేదా ప‌క్కల‌కు నొప్పి ఉంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు మంటగా అనిపిస్తుంది. త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంటుంది. కొంద‌రికి మూత్రంలో ర‌క్తం కూడా ప‌డుతుంది. మూత్రం దుర్వాసన వ‌స్తుంది. వికారంగా అనిపిస్తుంటుంది. వాంతులు అవుతాయి. … Read more

చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL) అంటే ఏమిటి ? వీటి మ‌ధ్య తేడాలేమిటి ?

మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌లు, ప‌నులు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవ‌స‌రం. క‌నుక మ‌నం నిత్యం కొలెస్ట్రాల్ ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మ‌న శ‌రీరం హార్మోన్ల‌ను త‌యారు చేసుకుంటుంది. అలాగే విట‌మిన్ డిని త‌యారు చేసుకుంటుంది. అయితే కొలెస్ట్రాల్ అస‌లు లేక‌పోవ‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా.. అంతే ప్ర‌మాద‌క‌రం. క‌నుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉండాలి. అయితే కొలెస్ట్రాల్ పేరు చెప్పిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు రెండు మాట‌లు బాగా … Read more

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఫిగ్స్.. వీటినే అత్తి పండ్లు అని.. అంజీర్ పండ్లు అని అంటారు. వీటి లోపల లేత పింక్ లేదా ముదురు పింక్ రంగులో విత్త‌నాలు, గుజ్జు ఉంటాయి. పై భాగంలో ఆకుప‌చ్చ‌, ప‌ర్పుల్‌, నీలం రంగును క‌లిగి ఉంటాయి. మ‌న‌కు మార్కెట్‌లో ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ల‌భిస్తాయి. అయితే ఈ పండ్లు చూసేందుకు కొంద‌రికి అంత‌గా చ‌క్క‌గా అనిపించ‌వు. కానీ నిజానికి ఈ పండ్ల‌తో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more