క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక … Read more

క్రాన్ బెర్రీలను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

క్రాన్ బెర్రీలు ఉత్త‌ర అమెరికాలో ఎక్కువ‌గా పండుతాయి. అక్క‌డి అనేక ప్రాంతాల్లో క్రాన్ బెర్రీల‌ను పండిస్తారు. అందువ‌ల్ల ఈ పండ్లు అక్క‌డి నేటివ్ ఫ్రూట్స్‌గా మారాయి. వీటిని సూప‌ర్‌ఫుడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇవి పుల్ల‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని చాలా మంది జ్యూస్ లేదా ఇత‌ర ప‌దార్థాల‌తో కలిపి తీసుకుంటారు. వీటితో సాస్‌, పొడి, స‌ప్లిమెంట్లు త‌యారు చేసి తీసుకుంటారు. ఇక డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ఇవి మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే క్రాన్ బెర్రీలలో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. … Read more

నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవాల‌న్న‌మాట‌. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఏ సీజ‌న్ అయినా, ఎక్క‌డ ఉన్నా, ఎప్పుడు అయినా స‌రే.. రోజులో తాగాల్సిన నీటి కోటాను క‌చ్చితంగా పూర్తి చేయాలి. దీంతో శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. అయితే నీటిని నిత్యం త‌గిన మోతాదులో తాగడం వ‌ల్ల కూడా అధిక బ‌రువు తగ్గ‌వ‌చ్చు. అవును.. … Read more

జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు దేశంలో కోవిడ్ ఆంక్ష‌ల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లే జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ యూకే ద్వారా కొత్త క‌రోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్ష‌ల అమ‌లును పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో జ‌న‌వ‌రి 31వ … Read more

కొత్త క‌రోనా స్ట్రెయిన్‌తో 2021లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం: నిపుణులు

క‌రోనా ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతుంద‌నుకుంటే ఆ మ‌హమ్మారి రూపం మార్చుకుని మ‌ళ్లీ వ‌చ్చి విజృంభిస్తోంది. మొద‌ట‌గా యూకేలో కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు బ‌య‌ట ప‌డ‌గా ఆ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ మ‌ళ్లీ గ‌తంలో మాదిరిగా కోవిడ్ ఆంక్ష‌ల‌ను విధించారు. ఇక ఇత‌ర దేశాలు కూడా యూకేకు ప్ర‌యాణాన్ని నిషేధించాయి. భార‌త్ కూడా విమానాల‌ను నిషేధించింది. అయితే ఇప్ప‌టికే యూకే నుంచి ప‌లువురు భార‌తీయులు స్వదేశానికి రావ‌డంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలాంటి … Read more

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పోష‌కాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌హిళ‌లు త‌మ జీవితంలో అనేక ద‌శ‌ల్లో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటారు. టీనేజ్‌లో, యుక్త వ‌య‌స్సులో, పెళ్లి అయ్యి త‌ల్లి అయ్యాక‌, త‌రువాతి కాలంలో, మెనోపాజ్ ద‌శ‌లో అనేక స‌మస్య‌ల‌ను వారు అనుభ‌విస్తుంటారు. ఒక్కో ద‌శలో అనారోగ్య స‌మ‌స్య‌లు వారిని వేధిస్తుంటాయి. అయితే ఏ ద‌శ‌లో అయినా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేయ‌కుండా ఉండాల‌న్నా.. ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అందుకు స‌మ‌తుల ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. అందులో త‌గిన పోష‌కాలు కూడా ఉండాలి. మ‌హిళ‌లు ఆరోగ్యంగా … Read more

తిప్ప‌తీగ క‌షాయంతో ఎన్నో లాభాలు.. ఇలా త‌యారు చేయాలి..!

తిప్ప‌తీగ‌ను ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని ప‌లు ఆయుర్వేద ఔషధాల‌ను త‌యారు చేసేందుకు వాడుతారు. తిప్ప‌తీగ వల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే తిప్ప‌తీగ‌ను ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప‌తీగ‌ను క‌షాయంలా చేసి తీసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… తిప్ప‌తీగ‌తో క‌షాయం చేయ‌ద‌లిస్తే అందుకు తిప్ప‌తీగ‌కు చెందిన 6 ఇంచుల కాండం ఉప‌యోగిస్తే చాలు. ఇది పెద్ద‌ల‌కు క‌లిగే వ్యాధుల‌ను నయం … Read more

తిప్ప‌తీగ‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి తిప్ప‌తీగ‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. దీన్నే సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. నిజంగా ఈ మొక్క మ‌న‌కు అమృతంలాగే ప‌నిచేస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని అంద‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే తిప్ప‌తీగ వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

జాజికాయ‌ల‌తో కలిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

జాజికాయ మ‌సాలా దినుసుల జాబితాకు చెందుతుంది. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ వంట ఇళ్ల‌లో ఉప‌యోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జాజికాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. జాజికాయ‌ల్లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నిర్మూలిస్తాయి. క్యాన్స‌ర్లు, … Read more

జామ ఆకుల‌తో కలిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని ప‌చ్చిగా ఉండ‌గానే తింటారు. అయితే ఇవి సాధార‌ణంగా మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. అందుక‌నే దీన్ని పేద‌వాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ పండ్లే కాదు, జామ ఆకులు … Read more