మన శరీరంలో జింక్‌ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా ? జింక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!

మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక మనకు రోజూ ఇది చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. అయితే మన శరీరంలో జింక్‌ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అనేక జీవక్రియలకు జింక్‌ పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్‌ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్‌ ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా … Read more

వెజిటేరియ‌న్ డైట్‌ను పాటిస్తున్నారా ? అయితే కాల్షియం పొందేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

వెజిటేరియ‌న్లుగా ఉండ‌డమంటే మాట‌లు కాదు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే వెజిటేరియ‌న్ డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇంకా ఎన్నో లాభాలు వెజిటేరియ‌న్ డైట్ వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వెజిటేరియ‌న్ల‌కు కాల్షియం ల‌భించాలంటే ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. నాన్ వెజ్ తినేవారికి అయితే గుడ్లు, పాలు, పాల ఉత్ప‌త్తులు, మాంసం తింటారు క‌నుక కాల్షియం బాగానే … Read more

కాల్షియం లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం ఉపయోగపడుతుంది. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీంతో అనేక రకాల నొప్పులు వస్తాయి. శరీరంలో కాల్షియం తగ్గితే ఆస్టియోపోరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. అలాగే హైబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లల్లో కాల్షియం తగ్గితే పెరుగుదల సరిగ్గా ఉండదు. అందువల్ల … Read more

Vitamin C : మ‌న‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌స‌రం ? వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?

Vitamin C : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చర్మాన్ని సంర‌క్షిస్తుంది. శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. Vitamin C ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా విట‌మిన్ సి తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే Vitamin C మ‌న‌కు ఎక్కువగా కూరగాయ‌లు, పండ్ల ద్వారా ల‌భిస్తుంది. … Read more

విట‌మిన్ బి1 లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? విట‌మిన్ బి1 ఉప‌యోగాలు తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక విట‌మిన్ల‌లో విట‌మిన్ బి1 కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో ఒక‌టి. దీన్ని మ‌న శ‌రీరం సొంతంగా త‌యారు చేసుకోలేదు. అందువ‌ల్ల రోజూ ఆహారాల ద్వారా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విట‌మిన్ బి1నే థ‌యామిన్ అని కూడా అంటారు. ఇది మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల ఈ విట‌మిన్‌ను మ‌న‌కు స‌రిగ్గా అందేలా చూసుకోవాలి. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల విధుల‌ను నిర్వర్తించేందుకు … Read more

మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఇ లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఇవి కొవ్వులో క‌రిగే విట‌మిన్. అంటే.. మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లోని కొవ్వును ఉప‌యోగించుకుని శ‌రీరం ఈ విట‌మిన్‌ను శోషించుకుంటుంది. విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవోకాడోలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సాల్మన్ చేప‌లు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా ల‌భిస్తుంది. … Read more

రాగి (కాప‌ర్‌) మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం.. దీని ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.. రాగి అందాలంటే ఇవి తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాల్లో రాగి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. రాగి వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. రాగితో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో, రాగి అందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే రాగి ఎంతో అవ‌స‌రం అవుతుంది. దీని వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య రాకుండా నివారించ‌వ‌చ్చు. రాగి వ‌ల్ల ర‌క్త‌హీన‌త రాకుండా అడ్డుకోవ‌చ్చు. … Read more

పొటాషియం మ‌న శ‌రీరానికి కావాలి.. ఇది లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో పొటాషియం కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండ‌రాల నొప్పులు, కండ‌రాలు ప‌ట్టుకుపోయిన‌ట్లు అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను పొటాషియం త‌గ్గిస్తుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల పొటాషియం ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తీసుకోవాలి.   మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేసేందుకు పొటాషియం ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. మ‌న శ‌రీరంలోని క‌ణాల‌కు పొటాషియం … Read more

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు.. మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో ముఖ్య‌మైన‌వి.. వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌టి. ఇవి గుండె ఆరోగ్యంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అయితే ఒమెగా 3 లాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలే. వీటిని కూడా మ‌నం త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల‌ను మ‌న శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. మ‌నం ఆహారం ద్వారానే వీటిని … Read more

ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మాత్ర‌మే కాదు.. ఇవి కూడా అవ‌స‌ర‌మే..!

కాల్షియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కాల్షియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌ల నిర్మాణానికి స‌హాయ ప‌డుతుంది. అయితే ఎముక‌ల ఆరోగ్యానికి కేవ‌లం కాల్షియం మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర పోష‌కాల‌ను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు విట‌మిన్ డి కూడా స‌హాయ ప‌డుతుంది. విట‌మిన్ డి త‌గినంత‌గా ఉంటేనే శ‌రీరం కాల్షియంను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. అందువ‌ల్ల శ‌రీరంలో … Read more