కిడ్నీ వ్యాధుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే.. చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువే..!

తీవ్ర‌మైన కిడ్నీ ( Kidney ) వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి మెట‌బాలిక్ సిండ్రోమ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అదే జరిగితే వారు త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని.. సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు జ‌ర్మ‌నీకి చెందిన సైంటిస్టులు ఈ విష‌యంపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. ఆ వివ‌రాల‌ను ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అనే జర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. జ‌ర్మనీకి చెందిన 5110 మంది తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారిని కొన్నేళ్ల పాటు సైంటిస్టులు ప‌ర్య‌వేక్షించారు. ఈ క్ర‌మంలో వారిలో … Read more

కొత్త భాష‌ల‌ను నేర్చుకుంటే మెదడు ప‌నితీరులో మార్పులు వ‌స్తాయి: సైంటిస్టులు

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే మాతృభాష కాకుండా ఇత‌ర భాష‌ల‌ను ఎక్కువ‌గా నేర్చుకోరు. ఇంగ్లిష్ అంటే అవ‌స‌రం ఉంటుంది క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ పాఠ‌శాల స్థాయి నుంచే దాన్ని నేర్చుకుంటారు. కానీ ఇత‌ర రాష్ట్రాలు, ఇత‌ర దేశాల‌కు చెందిన భాష‌ల‌ను ఎవ‌రూ నేర్చుకోరు. డిగ్రీ, పీజీ కోర్సులు చేసేవారికి మార్కుల కోసం లేదా ఆయా దేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఆ భాష‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఇత‌ర భాష‌ల‌ను నేర్చుకోవ‌డం వ‌ల్ల వారి మెద‌డు ప‌నితీరు మెరుగ‌వుతుంది. … Read more

షాకింగ్‌.. మాంసాహారుల క‌న్నా శాకాహారుల‌కే ఎముక‌లు ఎక్కువ‌గా విరుగుతాయి..!

మీరు శాకాహారులా ? అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మీకు నిజంగా చేదు వార్తే. ఎందుకంటే మాంసాహారం తినే వారి క‌న్నా శాకాహారం తినే వారి ఎముక‌లే ఎక్కువగా విరుగుతుంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. సుమారుగా 55వేల మందిపై చేసిన అధ్య‌య‌నాల మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. న‌ఫిల్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాపులేష‌న్ హెల్త్ సైంటిస్టులు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్య‌య‌నం చేప‌ట్టారు. మొత్తం 55వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్య‌య‌నం చేశారు. వారిలో … Read more

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారైనా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు, ఏజ్ స‌మ‌స్య కాదు: సైంటిస్టులు

అధిక బ‌రువును త‌గ్గించుకునే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉన్నాయి. వ‌య‌స్సు పెరిగే కొద్దీ బ‌రువు త‌గ్గ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో ఎంత‌మాత్రం నిజం లేదు. నిజానికి ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారైనా స‌రే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గేందుకు వ‌య‌స్సు అనేది అడ్డంకి కాదు.. అవును, సైంటిస్టులు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కూడా. యూనివ‌ర్సిటీ ఆఫ్ వార్‌విక్‌, యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్స్ కావెంట్రీ, … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన నిద్ర విధానాన్ని పాటిస్తే గుండె జ‌బ్బులు దూరం..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోవాలి. దీంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర కూడా పోవాలి. అయితే ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో చాలా మందికి నిద్ర క‌రువ‌వుతోంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్న‌ట్లు అవుతోంది. ఇక నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. యూకేలో 37 నుంచి 73 … Read more

కాఫీతో లివర్‌, జీర్ణ సమస్యలు దూరం.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

కాఫీ తాగే వారికి గుడ్‌ న్యూస్‌. నిత్యం కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. అలాగే ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని.. సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్ కాఫీ (ఐఎస్‌ఐసీ)కి చెందిన పరిశోధకులు కాఫీ అండ్‌ ఇట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ డైజెషన్‌ అనే … Read more

స‌రిగ్గా నిద్రించ‌డం లేదా..? శ‌్వాస‌కోశ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక శాతం మందికి దీర్ఘ‌కాలిక శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉంటాయి. గాలి కాలుష్యం, పొగ తాగ‌డం, దుమ్ము, ధూళి ఉన్న వాతావ‌ర‌ణంలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌డం, అల‌ర్జీలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్యలు వ‌స్తుంటాయి. అయితే కేవ‌లం ఇవే కావు.. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోయినా.. మ‌న‌కు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవును.. నిజ‌మే.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది. మ‌న శ‌రీరంలో ఎల్ల‌ప్పుడూ జ‌రిగే అనేక … Read more

వాకింగ్‌కు టైం లేదా..? ఫ‌ర్లేదు.. 12 నిమిషాలు వెచ్చించండి చాలు..!

నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాకింగ్ వ‌ల్ల అధిక బ‌రువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. అలాగే ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. అయితే చాలా మంది వాకింగ్ చేసేందుకు క‌నీసం 30 నిమిషాల స‌మ‌యం కూడా మాకు దొర‌క‌డం లేద‌ని చెప్పి వాపోతుంటారు. అలాంటి వారు క‌నీసం 12 నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే చాల‌ట‌. … Read more

పెద్ద శ‌బ్దాలు మ‌న ఆరోగ్యానికి నిజంగానే మంచివి కావు.. సైంటిస్టుల వెల్ల‌డి..

మ‌న‌లో చాలా మంది పెద్ద‌గా సౌండ్ పెట్టి మ్యూజిక్ వింటుంటారు. కొంద‌రు మూవీలు చూస్తుంటారు. ఇంకొంద‌రు టీవీలు వీక్షిస్తుంటారు. ఇక నిత్యం కొంద‌రు ప‌నిచేసే ప్ర‌దేశాల్లో, ఇత‌ర ప్రాంతాల్లో పెద్ద పెద్ద శ‌బ్దాల‌ను వినాల్సి వ‌స్తుంటుంది. అయితే ఇలా పెద్ద‌వైన శ‌బ్దాల‌ను విన‌డం మ‌న ఆరోగ్యానికి మంచిది కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దాంతో మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు అంటున్నారు. జ‌ర్మ‌నీకి చెందిన యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ ఆఫ్ మ‌యింజ్ ప‌రిశోధ‌కుడు మాథియాస్ ఓలెజ్ … Read more

బట్టతల ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట..!

బట్టతల ఉంటే అదృష్టమని.. పట్టిందల్లా బంగారమవుతుందని.. వారు చాలా అదృష్టవంతులని.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. నిజంగానే బట్టతల ఉన్నవారు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా నిలుస్తారట. అలాగే వెంట్రుకలు బాగా ఉన్నవారికంటే బట్టతల ఉన్నవారే స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తారట. అవును, నిజమే. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్‌లు బట్టతల ఉన్నవారిపై విడి … Read more