చ‌క్కెర అధికంగా తింటే గుండె పోటు వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో షుగర్ అధికంగా వుంటే శరీరం లావెక్కుతుందని, తద్వారా గుండె సంబంధిత వ్యాధులు మరింత పెరిగే అవకాశం వుందని ఎమోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మియమ్ వోస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన జర్నల్ లో రాసిన తన పరిశోధనా పేపర్లలో పేర్కొన్నారు. స్వీట్ ఎక్కువగానున్న ఆహారాలు, పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు ఎక్కువగా వుంటాయని, వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో అధిక బరువుతోపాటు … Read more

మ‌నం రోజూ వాడే చ‌క్కెర తెల్ల‌గా ఉండేందుకు ఎముక‌ల పొడి క‌లుపుతారా..?

చాలా మంది రోజూ చ‌క్కెర‌ను ఉప‌యోగిస్తుంటారు. దీన్ని టీ, కాఫీ త‌యారీలో వాడుతారు. అలాగే తీపి ప‌దార్థాల త‌యారీలోనూ, ఇత‌ర ద్రావ‌ణాలు లేదా వంట‌ల్లోనూ చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే చ‌క్కెర తెల్ల‌గా ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది తెల్ల‌గా ఉండేందుకు గాను అందులో జంతువుల ఎముక‌ల పొడిని క‌లుపుతార‌నే ఒక విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే ఇది నిజ‌మేనా, చ‌క్కెర తెల్ల‌గా ఉండేందుకు గాను జంతువుల ఎముక‌ల పొడిని క‌లుపుతారా..? అంటే..? సాధారణంగా, … Read more

ఒక నెల రోజుల పాటు చ‌క్కెర తిన‌డం పూర్తిగా మానేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

చ‌క్కెర లేదా దాంతో త‌యారు చేసే తియ్య‌ని ప‌దార్థాల‌ను తిన‌డం అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. నిత్యం ఏదో ఒక రూపంలో చ‌క్కెర‌ను తింటూనే ఉంటారు. అయితే ఏదైనా కొంత మోతాదులోనే తీసుకోవాలి. ప‌రిమితికి మించితే అది దుష్ప‌రిణామాల‌ను చూపిస్తుంది. చ‌క్కెర కూడా అంతే. శ‌రీరంలో చ‌క్కెర ఎక్కువైతే డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే ఒక నెల రోజుల పాటు పూర్తిగా చ‌క్కెర తిన‌డాన్ని మానేస్తే ఏం జ‌రుగుతుంది ? అంటే.. నిత్యం చ‌క్కెర‌ను … Read more

Sugar : చ‌క్కెర‌తో ఇలా చేయండి.. వాస్తు దోషాల‌న్నీ పోతాయి..!

Sugar : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం చేసే పొరపాట్ల వలన, సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వంటగదికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. వంటగదిలో ఆహారం వంటివి మనం పెట్టుకుంటూ ఉంటాము. వాస్తు ప్రకారం, సంతోషంగా మన జీవితం ఉండాలంటే, చక్కెరని ఇలా పెట్టడం మంచిది. చక్కెర సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. … Read more

బెల్లం, ప‌టిక బెల్లం, చ‌క్కెర‌.. ఈ మూడింటికీ మ‌ధ్య తేడాలు అస‌లు ఏమిటి..?

మ‌నకు అందుబాటులో ఉన్న తీపి ప‌దార్థాల్లో ముఖ్య‌మైన‌వి మూడు. ఒక‌టి చ‌క్కెర‌. రెండు బెల్లం. మూడు ప‌టిక బెల్లం. తీపి ప‌దార్థాల‌ను త‌గ్గించుకోవాల‌ని, చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను ఎక్కువ‌గా ఉప‌యోగించాల‌ని చెబుతుంటారు. బెల్లంను స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేస్తారు క‌నుక చ‌క్కెరకు బ‌దులుగా దాన్ని తినాల‌ని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో ప‌టిక బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. అయితే ఈ మూడింటి మ‌ధ్య ఉండే తేడాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు నుంచి చ‌క్కెర‌, బెల్లం, ప‌టిక బెల్లం.. … Read more

Sugar : చ‌క్కెర వాడాల్సిన ప‌నిలేదు.. తియ్య‌గా ఉండేందుకు వీటిని కూడా వాడ‌వ‌చ్చు..!

Sugar : మ‌న‌లో చాలా మంది పంచ‌దార‌తో చేసిన తీపి వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. పంచ‌దార‌తో చేసే ఈ తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే పంచ‌దారను ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే పంచ‌దార‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇది త్వ‌ర‌గా రక్తంలో క‌లిపి చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది. క‌నుక … Read more

Salt And Sugar : ఉప్పు, చ‌క్కెర‌.. మ‌న శ‌రీరానికి బ‌ద్ధ శ‌త్రువుల‌న్న సంగ‌తి మీకు తెలుసా..?

Salt And Sugar : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం అధిక ర‌క్త‌పోటు అని మ‌నంద‌రికి తెలిసిందే. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారిలో గుండెకు సంబంధించిన స‌మస్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జ‌రిపిన తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటుతో పాటు శ‌రీరంలో … Read more

Sugar : చ‌క్కెర‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఎన్ని ప్ర‌మాదాలు పొంచి ఉంటాయో తెలుసా..?

Sugar : తీపి పదార్దాలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. గులాబ్‌ జామూన్, జిలేబి, రసగుల్లా.. ఇలా పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతుంటుంది కదా. ఇంట్లో అమ్మ చేసే పాయసం ఇతరత్రా స్వీట్స్ కూడా లాగించేస్తుంటాం. వీటితో పాటు కూల్ డ్రింక్స్, రకరకాల పానియాలు షరా మామూలే. మీరు అమితంగా స్వీట్స్ ఇష్టపడేవారైతే, తీపి పదార్థాలను తినేవారైతే మీరు క‌చ్చితంగా ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. తీపి … Read more

Honey : చ‌క్కెర క‌న్నా తేనెనే చాలా మంచిది.. ఎందుకంటే..?

Honey : రోజూ మ‌నం అనేక సంద‌ర్భాల్లో చ‌క్కెర‌ను తింటుంటాం. కాఫీ లేదా టీ.. పండ్ల ర‌సాలు.. స్వీట్లు.. ఇలా మ‌నం రోజూ అనేక రూపాల్లో చ‌క్కెర‌ను తీసుకుంటుంటాం. అయితే చ‌క్కెరను అధికంగా తింటే మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. చ‌క్కెర అధిక‌మైతే అధికంగా బ‌రువు పెరుగుతారు. షుగ‌ర్ వ‌స్తుంది. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా పెరుగుతాయి. క‌నుక చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను వాడాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చ‌క్కెర … Read more

Sugar : చ‌క్కెర లేదా తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే.. మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Sugar : సాధార‌ణంగా చాలా మంది రోజూ ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను తింటుంటారు. భిన్న రుచులు ఉండే ఆహారాల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు తీపి అంటే ఇష్ట ప‌డితే కొంద‌రికి కారం అంటే ఇష్టం ఉంటుంది. కొంద‌రు పులుపు, ఇంకొంద‌రు వ‌గ‌రు.. అంటే ఇష్టంగా తింటారు. అయితే తీపి అంటే ఇష్ట ప‌డే వారే స‌హ‌జంగా ఎక్కువ‌గా ఉంటారు. ఈ క్ర‌మంలో వారు రోజూ తీపి లేదా చ‌క్కెరతో త‌యారు చేసే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే ఇలా … Read more