Pawan Kalyan : పవన్ కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. కింద పడిపోయిన జనసేనాని.. క్లాస్ పీకారు..!
Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ సభలో ప్రసంగించేందుకు కారులో వెళ్లారు. అయితే కొంతసేపు కారు పైకెక్కి ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని వేగంగా కారు మీదకు దూసుకువచ్చాడు. దీంతో పవన్‌ను ఆ అభిమాని ముందుకు నెట్టాడు. ఈ క్రమంలోనే అభిమాని తోయడంతో పవన్…