జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే.. మందారం పువ్వులు, ఆకులు..!

జుట్టు స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. వెంట్రుక‌ల చివర్లు చిట్లడం, రాలడం, నెరవడం… వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. వీటిని త‌గ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వుల‌తో కింద తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏడెనిమిది చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. … Read more

ఐర‌న్ లోపం, ల‌క్ష‌ణాలు, మ‌హిళ‌ల కోసం ఐర‌న్ ఉండే ఆహారాలు..!

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక ర‌కాల పోష‌కాలు అవ‌సరం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. దీన్నే ఇనుము అంటారు. మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి, ర‌క్తం ఉత్ప‌త్తి అయ్యేందుకు ఐర‌న్ ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఐర‌న్ లోపం ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఐర‌న్ లోపం మ‌న‌కు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఏర్ప‌డుతుంటుంది. ముఖ్యంగా స్త్రీల‌లో ఐర‌న్ లోపం స‌మ‌స్య … Read more

కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి ? ఎలా పాటించాలి ? కీటో డైట్ ఫుడ్‌ లిస్ట్, ఈ డైట్ వ‌ల్ల లాభాలు..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా కీటోజెనిక్ డైట్ (Ketogenic diet) అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తోంది. కీటోజెనిక్ డైట్‌ను పాటించి బ‌రువు త‌గ్గామ‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక కొంద‌రు అయితే డ‌యాబెటిస్ త‌గ్గింద‌ని అంటున్నారు. అయితే ఇంత‌కీ అస‌లు కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి ? ఈ డైట్‌ను ఎలా పాటించాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? అస‌లు కీటోజెనిక్ డైట్‌లో ఎలాంటి ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది ? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ కొబ్బ‌రినూనె ఉత్త‌మ‌మైంది.. ఎందుకో తెలుసా..?

కొబ్బరినూనెను నిత్యం సేవించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయని అంద‌రికీ తెలుసు. అయితే కొబ్బ‌రినూనె అనేది శ‌రీరం క‌న్నా జుట్టుకు ఇంకా అద్భుతంగా ప‌నిచేస్తుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఆ నూనె ప‌వ‌ర్‌ఫుల్ టానిక్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొబ్బ‌రినూనె వ‌ల్ల ఏయే జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * నిత్యం బాగా ఎండలో తిరిగేవారికి అనేక జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎండ‌లో తిరుగుతాం అనుకునేవారు కొబ్బ‌రినూనె నిత్యం త‌ల‌కు రాసుకోవ‌డం మంచిది. దీంతో ఎండ నుంచి … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ?

అధిక బ‌రువు త‌గ్గ‌డం అనేది ప్ర‌స్తుతం త‌రుణంలో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. బ‌రువు పెరుగుతున్నారు కానీ త‌గ్గ‌డం అంత సుల‌భంగా వీలు కావ‌డం లేదు. దీంతో అనేక మంది ర‌క ర‌కాల వ్యాయామ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు అన్నింటికన్నా ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ? నిత్యం ఏ వ్యాయామం చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు ? అంటే… * గంట‌కు సుమారుగా 8 మైళ్ల వేగంతో ర‌న్నింగ్ చేస్తే ఒక గంట‌లో … Read more

రోజూ 15 నిమిషాల పాటు న‌వ్వితే ఇన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయా..!

ప్ర‌స్తుతం అనేక మంది యాంత్రిక జీవితం గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే నిత్యం క‌నీసం ఒక పావుగంట పాటు అయినా న‌వ్వాల్సి ఉంటుంది. అవును.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * నిత్యం 15 … Read more

కూర‌గాయ‌ల్లో ఉన్న పోష‌కాలను కోల్పోకుండా ఉండాలంటే వాటిని ఎలా వండాలి ?

నిత్యం మ‌నం చేసే అనేక పొర‌పాట్ల వ‌ల్ల కూర‌గాయ‌ల్లో ఉండే పోషకాలు పోతుంటాయి. వాటిని కొనుగోలు చేసి తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి త‌రువాత తీసి క‌డిగి వండి తినేస‌రికి వాటిల్లో ఉండే పోష‌కాల సంఖ్య త‌గ్గుతుంది. దీంతో మ‌నం తినే కూర‌గాయ‌ల్లో చాలా త‌క్కువ పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి స‌రిపోవు. క‌నుక కూర‌గాయ‌లలో ఉండే పోష‌కాలు త‌గ్గ‌కుండా ఉండాలంటే వాటిని కింద తెలిపిన ప‌ద్ధ‌తిలో వండాల్సి ఉంటుంది. మ‌రి ఆ ప‌ద్ధ‌తి ఏమిటో ఇప్పుడు … Read more

ఇంగువ‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు..! 

ఇంగువ‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని అనేక వంట‌ల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ వేసి వండిన ప‌దార్థాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే… 1. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, అల్స‌ర్లు … Read more

చుండ్రు త‌గ్గాలంటే ఏం చేయాలి ? స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు !

మ‌న‌లో అధిక‌శాతం మందిని త‌ర‌చూ చుండ్రు స‌మ‌స్య వేధిస్తుంటుంది. దీంతో అనేక షాంపూలు గ‌ట్రా వాడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ చుండ్రు స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. అయితే కింద తెలిపిన‌ చిట్కాలను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * వారంలో కనీసం రెండు సార్లయినా కుంకుడుకాయతో లేదా శీకాయతో త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. * కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి … Read more

క‌ళ్లు పొడిగా మారి దుర‌ద పెడుతున్నాయా..? ఇలా చేయండి..!

ప్ర‌స్తుత ఆధునిక యుగంలో కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేయ‌డం ఎక్కువైపోయింది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం కూడా పెరిగింది. దీంతో కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొంద‌రికి క‌ళ్లు పొడిగా మారుతూ.. దుర‌ద‌లు వ‌స్తున్నాయి. అలాగే క‌ళ్ల నుంచి నీరు కార‌డం, క‌ళ్లు మంట‌లుగా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే.. ఆయా కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ఒక శుభ్ర‌మైన … Read more