ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప‌ని ఒత్తిడితోపాటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స‌మ‌స్య‌లు వ‌స్తున్నందున ఒత్తిడి, ఆందోళ‌నల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే వాటిని త‌గ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తుంది. కింద తెలిపిన 5 మూలిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. అశ్వ‌గంధ‌. దీన్నే ఇండియ‌న్ జిన్సెంట్ అని పిలుస్తారు. దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. … Read more

కుంకుమ పువ్వు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం మరిచిపోకండి..!

కుంకుమ పువ్వు ప్రపంచంలోని అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దారం లాంటి ఎరుపు తీగ‌ల్లా కుంకుమ పువ్వు ఉంటుంది. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి త‌యార‌వుతుంది. దీనిని సాధారణంగా క్రోకస్ అని పిలుస్తారు. కుంకుమ పువ్వు మొదట‌ గ్రీస్‌లో సాగు చేయబడిందని చెబుతారు. కానీ ప్ర‌స్తుతం ఇరాన్, గ్రీస్, మొరాకో, భారతదేశంల‌లో దీన్ని ఎక్కువ‌గా పండిస్తున్నారు. మ‌న దేశంలో కాశ్మీర్ కుంకుమ పువ్వుకు ప్ర‌సిద్ధి చెందింది. దీన్ని ఎక్కువ‌గా అక్క‌డే పెంచుతారు. ఇది … Read more

నేరేడు పండ్ల‌ను తిన్నాక విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. వాటితో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

వేస‌వి కాలం ముగింపుకు వ‌స్తుందంటే చాలు మ‌న‌కు ఎక్క‌డ చూసినా నేరేడు పండ్లు క‌నిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరేడు పండ్లు మ‌న‌కు విరివిగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉంటాయి. అయితే నేరేడు పండ్ల‌ను తిన్న త‌రువాత చాలా మంది విత్త‌నాల‌ను ప‌డేస్తారు. కానీ వాటితోనూ మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. కింద తెలిపిన విష‌యాల‌ను తెలుసుకుంటే ఇక‌పై మీరు నేరేడు పండ్ల‌ను తిన్న త‌రువాత విత్త‌నాల‌ను ప‌డేయ‌రు. నేరేడు విత్త‌నాల‌ను ఎండ బెట్టి పొడి చేసి … Read more

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే క‌ల‌బంద గుజ్జు.. దాని ఉప‌యోగాలు తెలుసుకోండి..!

అలోవెరా.. లేదా అలోయి బార్బాడెన్సిస్.. దీన్నే క‌ల‌బంద అంటారు. మందపాటి, చిన్న కాండం కలిగిన మొక్క. దీని ఆకులలో నీరు నిల్వ ఉంటుంది. చర్మ గాయాలకు చికిత్స చేయడానికి ఇది బాగా ప్రసిద్ది చెందింది. అయితే ఇది అనేక ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. 1. కల‌బంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. కలబంద చర్మ గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సౌందర్య, ఔషధ, ఆహార పరిశ్రమలు కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి ఆకులో … Read more

తుల‌సి ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి స‌ర్వ రోగ నివారిణిలా ప‌నిచేస్తుంది..!

భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు. కొంద‌రు పూజ‌లు చేయ‌కున్నా తుల‌సి మొక్క‌ల‌ను కావాల‌ని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తుల‌సి మొక్క‌కు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ మొక్క భాగాల‌ను ప‌లు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతారు. అయితే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.   … Read more

ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

అస‌లే క‌రోనా స‌మ‌యం. గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మందిని బ‌లి తీసుకుంది. దీనికి తోడు వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు, … Read more

దూసర తీగ వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ఉప‌యోగాలు..!

దూసర తీగ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎక్కువ‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తీగ గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపిస్తుంది. పొద‌ల‌పై తీగ‌లు అల్లుకుంటాయి. చేలు, పొలాల గ‌ట్టుల మీద పెరుగుతాయి. దూసర తీగ‌ల‌ను ఇంట్లోనూ పెంచుకోవ‌చ్చు. పెద్ద‌లు ఈ తీగ ఆకుల ర‌సాన్ని ప‌శువుల గాయాల‌కు రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. ఇక దూసర తీగ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సాధార‌ణంగా చాలా మందికి … Read more

త్రిఫ‌లాల్లో ఒక‌టి తానికాయ‌.. దీంతో క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే..!

ఆయుర్వేద ప్ర‌కారం వాత‌, పిత్త, క‌ఫ దోషాల్లో ఏర్ప‌డే అస‌మ‌తుల్య‌త‌ల వ‌ల్లే ఏ అనారోగ్య స‌మ‌స్య‌లు అయినా వ‌స్తాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇందుకు గాను త్రిఫ‌ల చూర్ణం వాడ‌మ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇది త్రిదోషాల‌ను స‌మం చేస్తుంది. దీంతో అన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే ఆ త్రిఫల చూర్ణంలో వాడే ఒక ప‌దార్థ‌మే తానికాయ‌. ఇది క‌ఫ దోష వ్యాధుల‌కు బాగా ప‌నిచేస్తుంది. తానికాయ‌లను అతిగా తీసుకుంటే వేడి చేస్తుంది. … Read more

బిళ్ల గన్నేరు మొక్కతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

బిళ్ల గన్నేరు. దీన్నే హిందీలో సదాబహార్‌ అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పెరివింకిల్‌ అని, వింకా రోసియా అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ మొక్కను సదాపుష్ప అని పిలుస్తారు. అంటే.. ఎప్పటికీ పువ్వులు పూస్తుందని అర్థం. ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లో బాగా పెరుగుతుంది. పింక్‌, తెలుపు రంగుల్లో పూలు పూస్తుంది. అయితే ఈ మొక్క వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే.. 1. … Read more

శంఖ‌పుష్పి గురించి తెలుసా..? ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది..!

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిని స‌రిగ్గా ప‌ట్టించుకోం. కానీ వాటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్ప‌బోయే మొక్క కూడా స‌రిగ్గా అలాంటిదే. ఈ మొక్క మ‌న ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు, నీలి రంగుల్లో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు దీన్ని అలంక‌ర‌ణ మొక్క‌గా కూడా పెంచుతుంటారు. కానీ దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంత‌కీ ఆ మొక్క ఏమిటో తెలుసా..? అదే.. … Read more