Hair Problems : మీ జుట్టు ఉన్న స్థితిని బ‌ట్టి మీకు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Hair Problems : జుట్టు రాల‌డం, తెల్ల‌గా మార‌డం.. చుండ్రు.. వంటివ‌న్నీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా వ‌స్తుంటాయి. ఇందుకు గాను స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను లేదా సాధార‌ణ షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే ఆ స‌మ‌స్యలు త‌గ్గిపోతాయి. అయితే ఎన్ని రోజులు లేదా నెలలు అయినా జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గ‌డం లేదంటే.. అందుకు వేరే ఏమైనా కార‌ణాలు అయి ఉంటాయి. మీకు ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. ఈ క్ర‌మంలోనే … Read more

Arthritis : ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Arthritis : ఆర్థ‌రైటిస్ అనేది స‌హ‌జంగా వృద్ధుల్లో వ‌స్తుంటుంది. కీళ్లు, ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల లేదా కాల్షియం లోపం వ‌ల్ల‌, వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ఆర్థరైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో శ‌రీరంలోని ప‌లు భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. కొద్దిగా క‌దిలినా.. ఎక్క‌డైనా ఒక చోట నొప్పి వ‌స్తుంటుంది. ఇక కీళ్ల భాగాల్లోనూ … Read more

Health Tips : గోల్డెన్ అవ‌ర్ అంటే ఏమిటి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ?

Health Tips : హార్ట్ ఎటాక్ లు అనేవి చెప్పి రావు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అవి ఎప్పుడైనా రావ‌చ్చు. కానీ రాకుండా ఉండ‌డం కోసం రోజూ అన్ని జాగ్ర‌త్త‌లనూ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం.. వేళ‌కు నిద్ర‌పోవ‌డం చేయాలి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చు. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన మొద‌టి ఒక గంట స‌మ‌యాన్ని గోల్డెన్ అవ‌ర్ అంటారు. ఈ స‌మ‌యంలో రోగికి ఎలాంటి చికిత్స‌ను అందించాలి … Read more

Urinary Problems : సాధార‌ణం క‌న్నా మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తోందా ? అయితే ఇవే కార‌ణాలు కావ‌చ్చు..!

Urinary Problems : మూత్ర విస‌ర్జ‌న అనేది రోజూ మ‌నం తాగే ద్ర‌వాల‌ను బ‌ట్టి వ‌స్తుంది. మ‌నం ఎక్కువ‌గా ద్ర‌వాల‌ను తాగుతున్నా.. చ‌ల్ల‌ని ప్ర‌దేశంలో ఉన్నా.. మూత్రం స‌హ‌జంగానే ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే రోజూ వ‌చ్చే మూత్ర విసర్జ‌న క‌న్నా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుందంటే.. దానికి ఏవో కార‌ణాలు ఉండే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్‌లు ఉంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్తారు. … Read more

Kidneys Health : ఈ 7 అలవాట్లు కిడ్నీల‌కి హానికరం.. వెంటనే వాటిని వదిలేయండి..!

Kidneys Health : కిడ్నీలు మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతూ శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మ‌నం రోజూ తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల కార‌ణంగా కిడ్నీలు అనారోగ్యానికి గుర‌వుతుంటాయి. ముఖ్యంగా మ‌నం పాటించే అల‌వాట్లు కిడ్నీల‌కు హాని చేస్తాయి. క‌నుక వాటిని వెంట‌నే వ‌దిలేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ అల‌వాట్లు ఏమిటంటే.. 1. చాలా మందికి కొద్దిపాటి నొప్పులు … Read more

Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో చెడు … Read more

ఊపిరితిత్తులు పాడైపోయాయి.. అని చెప్పేందుకు శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శ‌రీరంలోని కీల‌క‌మైన అవ‌యవాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. మ‌నం పీల్చుకునే గాలిని శుభ్రం చేసి దాన్ని శ‌రీరానికి అందివ్వ‌డంలో ఊపిరితిత్తులు నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే చెడు గాలి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి ఊపిరితిత్తులు పాడ‌వుతుంటాయి. కానీ ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. అలాంట‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాల‌ను శ‌రీరం తెలియ‌జేస్తుంది. వాటిని గ‌మ‌నించ‌డం ద్వారా ఊపిరితిత్తులు పాడైపోయాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. దీంతో ప్రాణాపాయ స్థితి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు. మ‌రి ఊపిరితిత్తులు పాడైతే … Read more

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా ? వాటితో క‌లిగే లాభాలివే..!

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో కొన్ని కోట్ల సంఖ్య‌లో బాక్టీరియా ఉంటాయి. వీటిలో మంచి బాక్టీరియా, చెడు బాక్టీరియా అని రెండు ర‌కాలు ఉంటాయి. అయితే మంచి బాక్టీరియా మన‌కు మేలు చేస్తుంది. ఇవి శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా, స్థూల‌కాయం రాకుండా చూస్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, వాపులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియాను మ‌నం పెంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాల‌ను … Read more

చంకల్లో దురదగా ఉందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు.. ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!

చర్మంపై చాలా మందికి అనేక చోట్ల సహజంగానే దురదలు వస్తుంటాయి. కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది. అయితే కొందరికి చంకల్లో ఎప్పుడూ దురదగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే.. శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి శరీరంపై కొన్ని భాగాల్లో దురదగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి కురుపుల్లా వస్తాయి. ఈ క్రమంలోనే కొందరికి చంకల్లో ఈ విధంగా అవుతుంది. అందుకనే ఆ భాగంలో దురద పెడుతుంది. ఇక … Read more

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

అస‌లే ఇది వ‌ర్షాకాలం. కాస్తంత ఆద‌మ‌రిచి ఉంటే చాలు, మ‌న‌పై దోమ‌లు దాడి చేస్తుంటాయి. చాలా వర‌కు వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. దోమలు కుట్టిన వెంట‌నే డెంగ్యూ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చాక ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు 4-10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే ల‌క్ష‌ణాలు … Read more