బ్రౌన్ బ్రెడ్ లేదా వైట్ బ్రెడ్‌.. రెండింటిలో ఏది మంచిదంటే..?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు మ‌నం అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటాం. ఆహారం విష‌యానికి వ‌స్తే నాణ్య‌మైన ఆహారాల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తాం. ఇక బ్రెడ్ విష‌యానికి వ‌స్తే వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్‌.. రెండింటిలో ఏది కొనాలో తెలియ‌క క‌న్‌ఫ్యూజ్ అవుతుంటాం. అయితే ఈ రెండింటిలో ఏ బ్రెడ్ మంచిది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది రోజూ ర‌క రకాల బ్రెడ్‌ల‌ను తింటుంటారు. వాటిల్లో బ్రౌన్ బ్రెడ్‌, వైట్ బ్రెడ్ … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్లు తాగ‌వ‌చ్చా ? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలి ?

నీటిని తాగే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. భోజ‌నం చేసే ముందు నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని కొంద‌రంటారు. భోజ‌నం అనంత‌రం నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని ఇంకొంద‌రు చెబుతారు. అయితే ఏది నిజం ? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలి ? వీటి గురించి ఆయుర్వేదం, అల్లోప‌తి వైద్యం ఏం చెబుతున్నాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్ల‌ను తాగే విష‌యం ఆయుర్వేదం, అల్లోప‌తి వైద్యం రెండూ ఒకే మాట చెబుతున్నాయి. భోజ‌నానికి ముందు లేదా … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని కోడిగుడ్ల‌ను తినాలో తెలుసా ?

కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే చాలా వ‌ర‌కు పోష‌కాలు గుడ్ల‌లో మ‌న‌కు ల‌భిస్తాయి. అందుక‌నే గుడ్ల‌ను సంపూర్ణ పోష‌కాహారంగా చెబుతారు. కోడ‌గుడ్ల‌లో పొటాషియం, నియాసిన్‌, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, విట‌మిన్ ఎ, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ డి, విట‌మిన్లు బి6, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల … Read more

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేశాక ఎక్కువ సేపు ఉంచితే విష‌పూరితంగా మారుతాయా ? నిజ‌మెంత ?

ఉల్లిపాయ‌ల‌తో మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లిపాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉల్లిపాయ‌ల‌ను వాడ‌వ‌చ్చు. అవి ఘాటుగా ఉంటాయి. కొంద‌రు రోజూ ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగానే తింటుంటారు. అయితే ఎంతో కాలం నుంచి అపోహ చాలా మందిలో నెల‌కొంది. అదేమిటంటే.. ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి అలాగే చాలా సేపు ఉంచితే విషపూరితంగా మారుతాయ‌ని, అందువ‌ల్ల వాటిని క‌ట్ చేశాక వెంట‌నే వాడాల‌ని.. చాలా మంది ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. అయితే దీని … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజుకు ఎన్ని చ‌పాతీల‌ను తినాలో తెలుసా ?

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూసే చాలా మంది తాము తినే పిండి ప‌దార్థాల‌తో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటారు. వాటిని ఎక్కువ‌గా తింటే బ‌రువు పెరుగుతామేమోన‌ని ఖంగారు పండుతుంటారు. అయితే నిజానికి ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మ‌న జీవ‌న విధానంలో, ఆహారపు అల‌వాట్ల‌లో అన్నం, చ‌పాతీలు ముఖ్య భాగంగా మారాయి. వీటిల్లో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గానే ఉంటాయి. అధిక బ‌రువును తగ్గించుకునేందుకు చాలా మంది రోజూ రాత్రి అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తింటుంటారు. ఎందుకంటే గోధుమ … Read more

కొబ్బ‌రినీళ్ల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చా ?

కొబ్బ‌రి నీళ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. స‌హ‌జంగానే వీటిని వేస‌విలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువ‌గా తాగుతారు. ఇక అనారోగ్యాల బారిన ప‌డిన వారు, శ‌స్త్ర చికిత్స‌లు అయిన వారు శ‌క్తిని పుంజుకునేందుకు, త్వ‌ర‌గా కోలుకునేందుకు కొబ్బ‌రినీళ్ల‌ను తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చా ? అంటే.. కొబ్బ‌రినీళ్ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో అయినా తాగ‌వ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున కూడా తాగ‌వ‌చ్చు. అయితే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని … Read more

రోజూ 3 ఖ‌ర్జూరాల‌ను తింటే ర‌క్తం పెరుగుతుందా ?

ఖ‌ర్జూరాలు ఎంతో తియ్య‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ క‌నీసం 3 ఖ‌ర్జూరాల‌ను అయినా స‌రే తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. శ‌క్తి ల‌భిస్తుంది. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు … Read more

శాకాహారం లేదా మాంసాహారం (వెజ్ డైట్‌ వ‌ర్సెస్ నాన్ వెజ్ డైట్‌) రెండింటిలో ఏ ఆహారం మంచిది ? ఎందుకు ?

ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీలు, మోడ‌ల్స్, ఔత్సాహికులు నాన్ వెజ్ డైట్‌ను వ‌దిలి వెజ్ డైట్‌ను పాటిస్తున్నారు. వెజ్ డైట్ ఆరోగ్య‌క‌ర‌మైంద‌ని, దాంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెబుతూ ఆ డైట్‌నే ఫాలో అవుతున్నారు. అయితే వెజ్ డైట్‌ను మూడు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి పూర్తి వెజిటేరియ‌న్ డైట్‌. రెండోది లాక్టో వెజిటేరియ‌న్ డైట్‌. మూడోది లాక్టో-ఓవో వెజిటేరియ‌న్ డైట్‌. ప్యూర్ వెజిటేరియ‌న్ డైట్‌లో పండ్లు, న‌ట్స్‌, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, ప‌ప్పు దినుసుల‌ను తింటారు. అదే లాక్టో … Read more

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా ? వాకింగ్ ఎంత వ‌ర‌కు స‌హాయ ప‌డుతుంది ?

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే వాకింగ్ చేయ‌డం వ‌ల్ల నిజంగానే అధిక బ‌రువు త‌గ్గుతారా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి అందుకు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. నిజ‌మే. అయితే వాకింగ్‌ను ఎప్పుడు చేశామ‌న్న‌ది ముఖ్యం. సాయంత్రం క‌న్నా ఉద‌యం వాకింగ్ చేయ‌డం వ‌ల్లే ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. … Read more

జుట్టుకు నూనె రాయ‌డం అవ‌స‌ర‌మా ? ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా ? జుట్టుకు నూనెను ఎలా రాయాలి ?

రోజూ మ‌నం తిరిగే వాతావ‌ర‌ణం, నివ‌సించే ప్ర‌దేశాల్లో ఉండే దుమ్ము, ధూళి మ‌న త‌ల‌లో చేరుతుంటాయి. అందువ‌ల్ల రెండు రోజుల‌కు ఒక‌సారి అయినా స‌రే క‌చ్చితంగా త‌ల‌స్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు రాకుండా ఉంటుంది. అయితే జుట్టుకు నూనె రాయాలా ? అది అవ‌స‌ర‌మా ? దాంతో ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా ? అంటే.. అవును.. జుట్టుకు నూనె రాయాల్సిందే. అయితే జుట్టుకు నూనెను రాసి ఎక్కువ సేపు ఉంచ‌కూడ‌దు. జిడ్డుగా ఉండే … Read more