స్కిమ్మ్‌డ్ మిల్క్, డ‌బుల్ టోన్డ్ మిల్క్ తేడాలు.. అధిక బ‌రువు త‌గ్గేందుకు ఏ పాలు మంచివి ?

అధిక బ‌రువును త‌గ్గించుకునే య‌త్నంలో చాలా మంది ముందుగా కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం మానేస్తుంటారు. ముఖ్యంగా పాల‌ను తాగేందుకు విముఖ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పి బ‌రువు త‌గ్గేవారు పాల‌ను తాగ‌డం మానేస్తారు. ఇక వెజిటేరియ‌న్ డైట్ పేరు చెప్పి కొంద‌రు కేవ‌లం సోయా పాలు, బాదం పాల‌నే తాగుతుంటారు. అయితే ఇవి కాకుండా స్కిమ్మ్‌డ్ మిల్క్‌, డ‌బుల్ టోన్డ్ మిల్క్ అని మ‌న‌కు రెండు ర‌కాల పాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి … Read more

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు మాస్క్ ధరించ‌డం ఆపేయ‌వ‌చ్చా ?

భార‌త దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ జ‌న‌వ‌రి 16వ తేదీన ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం రెండో ద‌శ టీకాల పంపిణీ కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబ‌డిన వారికి, 45 ఏళ్ల‌కు పైబ‌డి ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి వ్యాక్సిన్ల‌ను ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2,30,08,733 మందికి టీకాల‌ను ఇచ్చారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల‌ను తీసుకున్న వారు మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం ఆపేయ‌వ‌చ్చా ? అంటే అందుకు నిపుణులు ఏమ‌ని … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అస‌లు ఏ మాత్రం ప‌నికి రావు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాటిని అస్స‌లు తిన‌రాదు. కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్న‌మాట‌. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న … Read more

థైరాయిడ్ ఉన్న వారు కాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ తినకూడ‌దా ? నిజ‌మెంత ?

థైరాయిడ్‌లో రెండు ర‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి హైపో థైరాయిడిజం. రెండోది హైప‌ర్ థైరాయిడిజం. రెండింటిలో ఏది వ‌చ్చినా జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి ఉంటుంది. ఏ వైద్య విధానంలోనూ దీనికి పూర్తిగా చికిత్స లేదు. కానీ థైరాయిడ్ వ‌ల్ల క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూసేందుకు ఇత‌ర వైద్య విధానాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక థైరాయిడ్ ఉన్న‌వారు క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ ల‌ను తిన‌కూడ‌ద‌ని అంటుంటారు. వీటిని తింటే థైరాయిడ్ గ్రంథిపై ప్ర‌భావం ప‌డుతుందని, దీంతో … Read more

బ‌రువు పెరిగేందుకు ఏం చేయాలి ? ఏం ఆహారం తీసుకోవాలి ?

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. బ‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు దాన్ని త‌గ్గించుకునేందుకు య‌త్నిస్తున్నారు. అయితే బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌వారు బ‌రువు పెరిగేందుకు ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయుర్వేదం ద్వారా బ‌రువును ఎలా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువు పెరిగేందుకు నిత్యం ఆహారంలో కొవ్వు ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ల‌కు బ‌దులుగా కొవ్వులు ఎక్కువ‌గా ఉండే నెయ్యి, మాంసం, న‌ట్స్ వంటి ఆహారాల‌ను తినాలి. అయితే వీటి వల్ల శ‌రీరంలో … Read more

పాలను రాత్రి పూట ఎందుకు తాగాలి ? మిల్క్ షేక్స్ హానిక‌ర‌మా ?

పాల‌ను సంపూర్ణ పోష‌కాహారం అని పిలుస్తారు. భార‌తీయుల ఆహారంలో పాలు ఎంతో ముఖ్య భాగంగా ఉన్నాయి. పాల‌ను కొంద‌రు నేరుగా తాగుతారు. కొంద‌రు అందులో తేనె, ప‌సుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వంటివి క‌లుపుకుని తాగుతారు. పాల‌లో ప్రోటీన్లు, విట‌మిన్ ఎ, బి1, బి2, బి12, డి, పొటాషియం, మెగ్నిషియం వంటి పోష‌కాలు ఉంటాయి. నిత్యం మ‌నం తాగ‌వ‌ల్సిన ప‌లు ముఖ్య‌మైన పానీయాల్లో పాలు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయి. శాకాహారుల‌కు ప్రోటీన్లు కావాలంటే నిత్యం … Read more

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయా ?

దానిమ్మ పండ్ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా స‌రే నోరూరిపోతుంది. వాటి లోప‌లి విత్త‌నాలు చూసేందుకు భ‌లే ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది నేరుగానే తింటారు. కొంద‌రు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను తీసుకుంటే ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయి ? అస‌లు ఏమైనా ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? అంటే… కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తాయి. ఈ మాట‌ను సైంటిస్టులే చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివ‌ర్సిటీ … Read more

కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేరా..? ఇలా తీసుకున్నా షుగ‌ర్ త‌గ్గుతుంది..!

కాక‌ర‌కాయ జ్యూస్‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గుతుంద‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. కాక‌ర‌కాయ షుగ‌ర్‌కు బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తాగడం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గ‌డ‌మే కాదు, కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు దీంతో మ‌న‌కు క‌లుగుతాయి. అయితే కాక‌రకాయ జ్యూస్‌ను కొంద‌రు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కార‌ణం.. అది చాలా చేదుగా ఉంటుంది. కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు కూడా అవుతుంది. అయితే కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేం. ఇంకా ఏదైనా ప్ర‌త్యామ్నాయం … Read more

మూత్ర పిండాల్లో రాళ్ల‌కు ప‌రిష్కారం.. తీసుకోవాల్సిన ఆహారాలు..

ప్ర‌శ్న‌: నా మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయి. తీవ్ర నొప్పితో బాధ ప‌డుతున్నా. ఇప్పుడు నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ఆరోగ్యం మెరుగు ప‌డాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేమిటి ? మూత్రం ద్వారా మ‌న శ‌రీరంలోని మ‌లినాలు ద్ర‌వ రూపంలో బ‌య‌ట‌కు వెళ్తాయి. మూత్రం స‌క్ర‌మంగా త‌యారై ఎప్ప‌టికప్పుడు బ‌య‌ట‌కు వెళ్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా కొంద‌రిలో కొన్ని ర‌కాల ప‌దార్థాలు మూత్ర పిండాల్లోనే గ‌ట్టిగా, చిన్న రేణువుల్లా పేరుకుపోతాయి. శ‌రీర త‌త్వం, జీవ‌న‌శైలి, ఆహార‌పు … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more