ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌తో వ‌ర్షాకాలంలో మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి..!

వ‌ర్షాకాలం రాగానే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డుతుంది. దీంతో ద‌గ్గు, జలుబు, జ్వరాలు వ‌స్తుంటాయి. అనేక ర‌కాల సూక్ష్మ క్రిములు మ‌న శ‌రీరంపై దాడి చేస్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా సుర‌క్షితంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ ఉప‌యోగించాలి. వాటితో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. అతి మ‌ధురం దీన్నే హిందీలో ములేథి అని ఇంగ్లిష్‌లో లిక‌రైస్ అని అంటారు. … Read more

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిదో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను విరివిగా త‌మ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పాల‌లో ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు పోష‌ణ‌ను, శ‌క్తిని అందిస్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఏ సమ‌యంలో తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను తాగేందుకు ఉత్త‌మ‌మైన స‌మ‌యం.. రాత్రి. రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పాల‌ను తాగాల్సి ఉంటుంది. పాల‌ను తాగేందుకు అదే స‌రైన స‌మ‌యం. … Read more

ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప‌ని ఒత్తిడితోపాటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స‌మ‌స్య‌లు వ‌స్తున్నందున ఒత్తిడి, ఆందోళ‌నల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే వాటిని త‌గ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తుంది. కింద తెలిపిన 5 మూలిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. అశ్వ‌గంధ‌. దీన్నే ఇండియ‌న్ జిన్సెంట్ అని పిలుస్తారు. దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. … Read more

డయాబెటిస్ ను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

భారత దేశంలో రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 64.5 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి పలు ఆయుర్వేద చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వారు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. మన శరీరంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి … Read more

రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చా ?

వేస‌విలో స‌హ‌జంగానే చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. అలాంటి ప‌దార్థాల్లో పెరుగు మొద‌టి స్థానంలో నిలుస్తుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. పెరుగును తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఇది దంతాలు, ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగును తినే విష‌యంలోనూ ప‌లు నియ‌మాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తిన‌రాదు. కానీ దీనికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఆయుర్వేద … Read more

డ‌యాబెటిస్‌ను త‌గ్గించే 9 ర‌కాల మూలిక‌లు..!

రక్తంలో చక్కెర స్థాయిల‌ను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మూలికలు బాగా ప‌నిచేస్తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన‌ అధ్యయనాల‌లో వెల్లడైంది. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కింద తెలిపిన మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. 1. స‌ప్త‌రంగి.. దీన్నే తెలుగులో కొండ గంగుడు చెట్టు అంటారు. ఇది క‌ఫ దోషానికి చెందిన వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. మ‌ధుమేహం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాలేయం, … Read more

తరచూ వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..!

చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకునేందుకు మందుల షాపుల్లో అనేక ఇంగ్లిష్‌ మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పదే పదే వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం మేలు. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గడమే కాదు, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు. మనకు తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఏయే చిట్కాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మనలో … Read more

ఆయుర్వేద ప్రకారం శరీరాన్ని అంతర్గతంగా ఇలా శుభ్రం చేసుకోండి..!

నిత్యం మనం తినే ఆహారాలు, పాటించే అలవాట్లు, తిరిగే వాతావరణం వల్ల శరీరంలో మలినాలు చేరుతుంటాయి. అయితే శరీరం తనను తాను అంతర్గతంగా శుభ్రం చేసుకుంటూనే ఉంటుంది. కానీ మలినాలు మరీ ఎక్కువగా పేరుకుపోతే శరీరం కూడా ఏమీ చేయలేదు. కనుక మన శరీరాన్ని మనమే అంతర్గతంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీన్నే డిటాక్సిఫికేషన్‌ అంటారు. ఆయుర్వేద ప్రకారం ఈ ప్రక్రియను శోధన ప్రక్రియ అని పిలుస్తారు. అంటే శరీరంలోని రక్తంతోపాటు పలు ఇతర అవయవాల్లో ఉన్న … Read more

త్రిదోషాల్లో ఏయే దోషం ఉన్న‌వారు ఏయే ఆహారాల‌ను తినాలి..?

ఆయుర్వేదం అత్యంత పురాత‌న‌మైన వైద్య విధానం. ఎన్నో వ్యాధుల‌కు ఆయుర్వేదం ప‌రిష్కార మార్గాల‌ను చూపుతుంది. భార‌తీయుల జీవన విధానం ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆయుర్వేదంతో మిళిత‌మై ఉంది. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయుర్వేదంకు అంతటి ప్రాధాన్య‌త ల‌భిస్తున్నందుకు భార‌తీయులు అంద‌రూ గ‌ర్వ‌ప‌డాలి. అయితే మ‌నిషికి అనారోగ్య స‌మ‌స్య‌లు అనేవి వాత‌, పిత్త‌, క‌ఫ దోషాల్లో ఉండే అస‌మ‌తుల్య‌త‌ల వ‌ల్ల వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందువ‌ల్ల ఆయా దోషాల‌ను ఎప్పుడూ స‌మ‌తుల్యంగా ఉంచుకోవాలి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. … Read more

ఆయుర్వేదం ప్ర‌కారం రోగ నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి..!!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. ఈ క్ర‌మంలో కోవిడ్ రాకుండా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప‌లు సూచ‌న‌లు పాటించాలి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. ఆయుర్వేద ప్ర‌కారం రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంచుకోవ‌చ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వివ‌రిస్తోంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… 1. … Read more