రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేస్తున్నారా ? అయితే ఎంత ప్ర‌మాద‌మో తెలుసుకోండి..!

ఆహారాన్ని రోజూ స‌రైన స‌మ‌యంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌ను స‌రైన టైముకు చేయాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కానీ కొంద‌రు రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. అయితే ఈ విధంగా రాత్రి పూట ఆల‌స్యంగా తిన‌డం వ‌ల్ల ఎలాంటి హాని క‌లుగుతుందో, ఆ విధ‌మైన అల‌వాటు ఎంత ప్ర‌మాదమో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేస్తే ఆ ప్ర‌భావం మెద‌డుపై తీవ్రంగా ప‌డుతుంది. దీంతో … Read more

వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో శ‌రీరాన్ని మసాజ్ చేసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

నువ్వుల నూనె మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈ నూనెతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. దీంతో మ‌న పెద్ద‌లు వారం వారం శ‌రీరాన్ని మ‌ర్ద‌నా చేసుకుని స్నానం చేసేవారు. అయితే ఈ ప‌ద్ధ‌తిని ఇప్పుడు పాటించ‌డం లేదు. కానీ నువ్వుల నూనెతో వారానికి ఒక‌సారి అయినా స‌రే శ‌రీరాన్ని బాగా మ‌ర్ద‌నా చేసుకుని స్నానం చేయాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేయ‌డం … Read more

ఆరోగ్యంగా ఉండేందుకు ప‌ళ్ల ర‌సం లేదా పండ్లు.. రెండింటిలో ఏవి తీసుకుంటే మంచిది ?

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవ‌రైనా స‌రే అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు ప‌ళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు. ప‌ళ్ల‌ రసం తాగడం వల్ల శక్తి ల‌భిస్తుంది. తాజాద‌నం అందుతుంది. దీంతో చాలా మంది ప‌ళ్ల ర‌సాల‌ను చాలా ఆరోగ్యకరమైనవిగా, ప్రయోజనకరమైనవిగా భావిస్తారు. ప‌ళ్ల రసం, పండ్ల‌లో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పండ్ల రసాలలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే … Read more

బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడ‌క‌బెట్టిన‌ కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. రోజంతా ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు లభిస్తాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో కోడిగుడ్లు ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లో ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. … Read more

జీల‌క‌ర్ర నీటిని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

జీల‌క‌ర్ర‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. వికారం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.   … Read more

జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌: దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

బ‌రువు త‌గ్గ‌డం అనేది చాలా మందికి క‌ష్ట‌మైన ప‌నే. దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాల్సిందే. దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం వ‌ర‌కు బరువు త‌గ్గేందుకు చాలా మంది అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే జ‌పాన్‌కు చెందిన ఓ ర‌క‌మైన ట‌వ‌ల్ ఎక్సర్‌సైజ్‌ను చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వుతోపాటు అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువును త‌గ్గించే జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఇలా చేయాలి. 1. … Read more

త్రేన్పులు బాగా వ‌స్తున్నాయా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించి చూడండి..!

తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే దాన్ని అజీర్ణం అంటారు. అజీర్ణ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న‌వారిలో, ఆహారం తిన్న త‌రువాత కొంత సేప‌టికి జీర్ణాశ‌యంలో గ్యాస్ చేరినా.. త్రేన్పులు బాగా వ‌స్తుంటాయి. కొంద‌రికి త్రేన్పులు వచ్చేట‌ప్పుడు పుల్ల‌గా లేదా కుళ్లిన వాస‌న అనిపిస్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. త్రేన్పుల స‌మ‌స్య ఉన్న‌వారు అగ్ని తుండివ‌టి ట్యాబ్లెట్ల‌ను వాడుకోవ‌చ్చు. రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు … Read more

పారిజాత వృక్షం పువ్వులు, ఆకులు.. అద్భుతం.. అనేక అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

మ‌న చుట్టూ అందుబాటులో ఉన్న అనేక ర‌కాల వృక్షాల్లో పారిజాత వృక్షం కూడా ఒక‌టి. దీని పువ్వులు, ఆకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ వృక్షం మ‌న‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పారిజాత వృక్షం ఆకులు, పువ్వుల‌తో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పారిజాత వృక్షం ఆకులు, బెర‌డు అనేక జ్వ‌రాల‌ను త‌గ్గిస్తాయి. మ‌లేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవి … Read more

స్పిరులినాతో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

స్పిరులినా (Spirulina) అనేది ఉప్పు నీటి జ‌లాల్లో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క అని చెప్ప‌వ‌చ్చు. ఇది స‌య‌నో బాక్టీరియా జాతికి చెందిన‌ది. దీన్ని ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇత‌ర మొక్క‌ల్లానే ఇది కూడా కిర‌ణ జ‌న్య సంయోగ క్రియ‌ను చేప‌డుతుంది. ఇక స్పిరులినాను పొడిగా, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఇది అత్యంత పోష‌క విలువలు ఉన్న ప‌దార్థం. దీన్ని నిత్యం 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు. దీంతో అనేక … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ప‌సుపు క‌లుపుకుని తాగితే.. ఎన్నో వ్యాధుల‌ను త‌గ్గించుకోవచ్చు..!

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. వాటికి బదులుగా ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల‌ను తాగాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు బ‌య‌టకు పోవ‌డ‌మే కాదు, అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాంటి పానీయాల్లో ప‌సుపు నీళ్లు కూడా ఒక‌టి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో ప‌సుపు క‌లిపి … Read more