నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఏయే ఆహారాల‌ను తింటే మంచిది ?

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ వంటివి తాగుతుంటారు. అలా తాగ‌నిదే వారికి రోజు మొద‌ల‌వదు. అయితే వాటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి పోష‌ణ‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే నిత్యం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌ద‌గిన ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒక‌టి. ముందురోజు వీటిని నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే … Read more

మెద‌డు చురుగ్గా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌లో కొంద‌రికి మెద‌డు అంత యాక్టివ్‌గా ఉండ‌దు. నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే.. ఒక మనిషికి తెలివితేట‌లు అనేవి ఎవ‌రో నేర్పిస్తే రావు.. అవి పుట్టుక‌తో వ‌స్తాయి. అందువ‌ల్ల మెద‌డు యాక్టివ్ లేద‌ని ఎవ‌ర్నీ నిందించాల్సిన ప‌నిలేదు. ఇక వ‌యస్సు మీద ప‌డే వారిలో, పలు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారిలో స‌హ‌జంగానే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. మెద‌డును ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉంచుకోవ‌చ్చు. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి … Read more

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను ఏయే స‌మ‌యాల్లో చేస్తే మంచిది ?

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో స‌గ‌టు పౌరుడు నిత్యం అనేక ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాడు. నిత్యం నిద్ర లేచింది మొద‌లు స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దీంతో స‌మ‌యానికి తిండి తిన‌డం లేదు. ఫ‌లితంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాడు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన సూత్రాల్లో ఒక‌టి.. నిత్యం స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌ల‌ను స‌మ‌యానికి చేయాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే ఆయా ఆహారాల‌ను ఏయే స‌మ‌యాల్లో తీసుకుంటే … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు చ‌పాతీల‌ను తిన‌వ‌చ్చా ? చ‌పాతీలు తింటే బ‌రువు త‌గ్గుతారా ?

అధిక బ‌రువును త‌గ్గించుకోవడం అనేది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుక‌నే చాలా మంది నిత్యం తాము తినే ఆహారాన్ని త‌గ్గించి తిన‌డ‌మో లేదా అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డ‌మో చేస్తుంటారు. అయితే నిజానికి చ‌పాతీల‌కు, బ‌రువు త‌గ్గేందుకు సంబంధం లేదు. అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. చాలా మంది చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అన్నంలో, చ‌పాతీల‌ను త‌యారు చేసేందుకు వాడే గోధుమ పిండిలో పిండి … Read more

జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కా..!

జ‌లుబు చేసిన‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ముక్కు రంధ్రాలు ప‌ట్టేసి గాలి ఆడ‌కుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్ర‌పోలేక‌పోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. ముక్కు దిబ్బడ‌, జ‌లుబును త‌గ్గించేందుకు వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. వాము, ఉప్పుల‌ను సమభాగాలుగా చేసి … Read more

రాత్రి పూట అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

అర‌టి పండ్ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో పోష‌కాల‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. సాధార‌ణంగా వ్యాయామం చేసేవారు, జిమ్‌కు వెళ్లేవారు శ‌క్తి కోసం అర‌టి పండ్ల‌ను తింటుంటారు. అర‌టి పండ్ల‌లో ఉండే పోష‌కాలు మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. అయితే అర‌టి పండ్ల‌ను రాత్రి పూట తిన‌వ‌చ్చా ? అంటే.. అర‌టి పండ్ల‌ను ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం తింటే మంచిది. రాత్రి పూట తిన‌ద‌లిస్తే 7 గంట‌ల‌లోపే తినాలి. ఎందుకంటే అర‌టి పండ్ల వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. రాత్రి 7 … Read more

మనిషి స‌రిగ్గా నిద్ర పోకపోతే ఏం జరుగుతుంది ?

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో స‌గ‌టు పౌరుడికి నిత్యం నిద్ర క‌రువ‌వుతోంది. అనేక ఒత్తిళ్ల మ‌ధ్య కాలం గ‌డుపుతుండ‌డంతో నిద్ర స‌రిగ్గా పోవ‌డం అనేది స‌మ‌స్య‌గా మారింది. అయితే నిజానికి నిద్ర అనేది చాలా వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది. మ‌నిషి నిద్రపోవడం చాలా అత్యవసరం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో ప్ర‌తి ఒక్క‌రూ అలిసిపోతూనే ఉంటారు. అలా అలిసిపోయిన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. … Read more

చ్యవనప్రాష్ లేహ్యాన్ని ఎందుకు, ఎలా, ఎవరు సేవించాలి ?

మ‌న‌లో చాలా మందికి చ్య‌వ‌న‌ప్రాష్ లేహ్యం గురించి తెలిసే ఉంటుంది. డాబ‌ర్ వంటి కంపెనీలు ఈ లేహ్యాన్ని త‌యారు చేసి మ‌న‌కు అందిస్తున్నాయి. ఇందులో 50 వ‌ర‌కు ఔష‌ధ విలువ‌లు క‌లిగిన మూలిక‌లు ఉంటాయి. అందువ‌ల్ల చ్య‌వ‌న‌ప్రాష్ లేహ్యం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. చ్య‌వ‌న‌ప్రాష్ లేహ్యాన్ని ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. మ‌ధుమేహం ఉన్న‌వారు వైద్యుల సూచ‌న మేర‌కు వాడుకోవాలి. ఇక పిల్ల‌ల‌కు కాకుండా పెద్ద‌లు ఎవ‌రైనా దీన్ని తీసుకోవ‌చ్చు. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. … Read more

ఏయే సమస్యలకు త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడాలంటే ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. దీంట్లో విటమిన్‌ సి, ఫైటో కెమికల్స్, ఫైటో న్యూట్రియంట్స్‌, పాలీఫినాల్స్, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి. పోషకాల కంటే వీటిలో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా దీన్ని మలబద్దక సమస్య నివారణకు వాడుతారు. త్రిఫల చూర్ణాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నారనేది ముఖ్యం. అనుపాతంతో దీని గుణాలు మారుతుంటాయి. గోరు … Read more

ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఏయే ఆహారాల‌ను తినాలి ?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. ఇంట్లో చేసుకునే వంట‌లే కాక‌, బ‌య‌ట కూడా అనేక ప‌దార్థాల‌ను ఆబ‌గా లాగించేస్తుంటాం. అయితే మ‌నం తినే అన్ని ఆహారాలు ఆరోగ్య‌క‌ర‌మైన‌వి కావు. ఉదాహ‌ర‌ణ‌కు.. వేపుళ్లు, కొవ్వు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న‌వి, చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న‌వి.. మ‌న ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం కాదు. క‌నుక నిత్యం మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగిన ఆహార ప‌దార్థాల‌నే తినాల్సి ఉంటుంది. * నిత్యం మ‌నం ఏ స‌మ‌యంలో ఏ ఆహారం … Read more