చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

చిగుళ్ల స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపు లేదా ర‌క్త స్రావం అవుతుంటుంది. దీంతో ఏది తినాల‌న్నా, తాగాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చిగుళ్ల నుంచి కారే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. చిగుళ్ల వాపులు త‌గ్గుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

ట‌మాటా కెచ‌ప్‌ను ఎక్కువ‌గా తింటున్నారా ? అయితే ఈ స‌మస్య‌లు త‌ప్ప‌వు..!!

ట‌మాటా కెచ‌ప్‌ను స‌హ‌జంగానే ప‌లు ఆహారాల‌పై వేసుకుని తింటుంటారు. ముఖ్యంగా బేక‌రీ ఆహారాల‌తోపాటు ఫాస్ట్ ఫుడ్‌పై కెచ‌ప్‌ను వేసి తింటారు. అయితే కెచ‌ప్ ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ట‌మాటా కెచ‌ప్‌ను అధికంగా తింటే బ‌రువు అధికంగా పెరిగి స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది. ఎందుకంటే కెచ‌ప్‌లో చక్కెర‌, ప్రిజ‌ర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. క్యాల‌రీలు కూడా ఎక్కువే. అందువ‌ల్ల కెచ‌ప్‌ను అధికంగా … Read more

క్యాన్సర్ రోగులకు మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

మ‌జ్జిగ‌ను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. పెరుగు తినేందుకు ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా మజ్జిగ సేవిస్తుంటారు. మజ్జిగ సులభంగా జీర్ణమవుతుంది. ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంటను త‌గ్గిస్తుంది. రక్తహీనతను త‌గ్గించి ఆక‌లిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , అవసరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. అందువ‌ల్ల మ‌జ్జిగ‌ను రోజూ సేవించాలి. మజ్జిగలో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ద్ర‌వాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీత‌ల పానీయాల‌ను … Read more

తర‌చూ త‌ల తిరిగిన‌ట్లు అనిపిస్తుందా ? అందుకు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..!!

త‌ల తిర‌గ‌డం అనేది స‌హ‌జంగానే కొంద‌రికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అలాంటి స‌మ‌యాల్లో కొంద‌రు స్పృహ త‌ప్పి ప‌డిపోతుంటారు. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లోప‌లి చెవిలో అధికంగా ద్ర‌వాలు పేరుకుపోతే త‌ల తిర‌గ‌డం స‌మ‌స్య వ‌స్తుంది. ఇది కొన్ని గంట‌ల పాటు అలాగే ఉంటుంది. దీంతో వినికిడి లోపం, చెవుల్లో రింగుమ‌ని శ‌బ్దాలు వినిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీన్నే మినియెర్స్ డిసీజ్ అంటారు. ఈ విధంగా … Read more

గర్భం దాల్చిన మ‌హిళ‌లు ఎన్నో నెల త‌రువాత పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగాలో తెలుసా ?

కుంకుమ పువ్వును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. ఇది అద్భుత‌మైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల నాన్ వెజ్ వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం కుంకుమ పువ్వులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ విలువ‌లు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి గ‌ర్భిణీలు తాగడం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బిడ్డ‌కు అనేక పోష‌కాలు అందుతాయి. దీంతో బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. పుట్టుక‌తో … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ స‌మ‌స్య వ‌స్తుంటే.. చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా మారింది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా డ‌యాబెటిస్ వ‌చ్చింద‌ని నిర్దారించ‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌గా చికిత్స తీసుకుని దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి డ‌యాబెటిస్ ఆరంభంలో … Read more

కోడిగుడ్లంటే ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!!

కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్‌, బాయిల్డ్ ఎగ్ లేదా కూర‌ల రూపంలో గుడ్ల‌ను తింటుంటారు. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎంత ప‌డింతే అంత తిన‌కూడ‌దు. అధికంగా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి ?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను శారీర‌కంగా చేస్తుంటాం. కానీ మాన‌సికంగా చేసే ప‌నుల‌కు మెద‌డు యాక్టివ్‌గా ఉండాలి. మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలి. దీనికి తోడు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా ఉండాలి. దీంతో మైండ్‌తోనూ మ‌నం చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతాం. క‌నుక మెద‌డు యాక్టివ్‌గా ఉండాల‌న్నా, జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాల‌న్నా అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. డ్రై ఫ్రూట్స్ వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు, న‌లుపు రంగు కిస్మిస్‌, జీడిప‌ప్పు వంటి … Read more

శొంఠి వల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

భార‌తీయులు త‌మ వంట ఇంటి ప‌దార్థాల్లో అల్లంను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. నిత్యం అనేక వంట‌కాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే అల్లంతో శొంఠి త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాన్ని పాల‌లో ఉడ‌కబెట్టి త‌రువాత దాన్ని ఎండ‌బెడ‌తారు. దీంతో త‌యార‌య్యే ప‌దార్థాన్ని శొంఠి అంటారు. అయితే ఈ విధంగా అల్లంను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా … Read more

లివ‌ర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?

ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉసిరికాయ‌ల‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్య నిపుణులు … Read more