మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు కోవిడ్ రోగులు మరిన్ని వైరస్‌ కణాలను విడుదల చేస్తారు..!

కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాటి ద్వారా వ‌చ్చే తుంప‌ర్ల కార‌ణంగా కోవిడ్ ఇత‌రుల‌కు వ్యాపిస్తుంది.ఇప్పటి వరకు పరిశోధకులు, వైద్య నిపుణులు ఇదే చెప్పారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) చేసిన ఒక కొత్త అధ్యయనంలో.. కోవిడ్‌ సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు విడుదలయ్యే క‌ణాల వ‌ల్ల ముఖ్యంగా ఇండోర్ వాతావరణంలో ఎక్కువ వేగంగా వైర‌స్ వ్యాప్తి చెందేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని.. తేలింది. NUS పరిశోధకులు ఈ రెండు రకాల కార్యకలాపాల … Read more

భార‌త్‌కు చెందిన కోవిడ్ వేరియెంట్ 44 దేశాల్లో గుర్తింపు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న‌..

క‌రోనా నేప‌థ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో గ‌తేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్ల‌డించింది. ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పేర్కొంది. మే 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రిశీలించారు. దీంతో స‌ద‌రు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో … Read more

మీ కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయో, లేదో ఈ సుల‌భ‌మైన ట్రిక్స్ స‌హాయంతో తెలుసుకోండి..!

కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వ‌ర‌కు తెలియడం లేదు. కానీ అవి చిన్న‌గా ఉన్న‌ప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సుల‌భంగా క‌రిగించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను, సూచ‌న‌ల‌ను చూపిస్తుంది. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా మ‌న‌కు కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మార‌కుండా చూసుకోవ‌చ్చు. … Read more

భార‌తీయ యువ‌త‌లో పెరుగుతున్న గుండె జ‌బ్బులు.. అవి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే..!

గ‌త ఏడాదిన్న‌ర కాలంగా భార‌త దేశంలో వైద్య, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోది. ఈ క్ర‌మంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క్లినిక‌ల్ అండ్ డ‌యాగ్న‌స్టిక్ రీసెర్చ్ కు చెందిన జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన వివరాల ప్రకారం భార‌తీయుల్లో ప్ర‌స్తుతం యువ‌త‌లో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని తేలింది. గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా యువ‌తే ఉంటున్నార‌ని వెల్ల‌డించారు. … Read more

వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

వెక్కిళ్లు అనేవి సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. అవి చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రికి అదే ప‌నిగా వెక్కిళ్లు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రికి సుమారుగా 48 గంట‌ల పాటు వెక్కిళ్లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెక్కిళ్లు మన శ‌రీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో, … Read more

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

మ‌లం అనేది చాలా మందికి ర‌క‌ర‌కాలుగా వ‌స్తుంది. ముందు రోజు తిన్న ఆహార ప‌దార్థాల రంగుల‌కు అనుగుణంగా లేదా ప‌సుపు లేదా గోధుమ రంగులో స‌హ‌జంగానే ఎవ‌రికైనా మ‌లం వ‌స్తుంది. ఇక ఐర‌న్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందుల‌ను మింగే వారికి కూడా స‌హ‌జంగానే మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. కానీ ఈ విధంగా చేయ‌ని వారికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్ర‌మైన అనారోగ్య స్థితి వ‌ల్లే అయి ఉండే అవ‌కాశాలు … Read more

కోవిడ్ వ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా ?

క‌రోనా వ‌చ్చిన వారికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా, స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్నా.. ఇంటి వ‌ద్దే ఉండి చికిత్స తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే అలాంటి వారిలో కొంద‌రికి 2-3 రోజుల్లోనే ల‌క్ష‌ణాలు ఎక్కువై ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అలాంటి ఎంద‌రో చ‌నిపోయారు కూడా. కానీ కోవిడ్ వ‌చ్చిన వారికి ఒక్క విష‌యంలోనే ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అది శ్వాస తీసుకోలేక‌పోవ‌డం. కోవిడ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా … Read more

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేశాక ఎక్కువ సేపు ఉంచితే విష‌పూరితంగా మారుతాయా ? నిజ‌మెంత ?

ఉల్లిపాయ‌ల‌తో మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లిపాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉల్లిపాయ‌ల‌ను వాడ‌వ‌చ్చు. అవి ఘాటుగా ఉంటాయి. కొంద‌రు రోజూ ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగానే తింటుంటారు. అయితే ఎంతో కాలం నుంచి అపోహ చాలా మందిలో నెల‌కొంది. అదేమిటంటే.. ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి అలాగే చాలా సేపు ఉంచితే విషపూరితంగా మారుతాయ‌ని, అందువ‌ల్ల వాటిని క‌ట్ చేశాక వెంట‌నే వాడాల‌ని.. చాలా మంది ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. అయితే దీని … Read more

రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ రైస్ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగ‌ర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ … Read more

కంటి చూపు మెరుగు ప‌డాలంటే.. ఈ జ్యూస్‌ల‌ను తాగండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ క‌ళ్ల ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఫ‌లితంగా కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌ళ్లు నొప్పులు రావ‌డం, దుర‌ద‌లు పెట్ట‌డం, కంటి చూపు స‌రిగ్గా లేక‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ స‌మ‌యం పాటు స్క్రీన్‌ల‌ను చూడ‌డం.. వంటివి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కంటి చూపు మంద‌గిస్తోంది. చిన్నారులు కూడా ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీల ఎదుట గ‌డుపుతున్నారు. … Read more