ధనియాలలో ఎన్ని అద్భుత గుణాలు దాగి ఉన్నాయో తెలుసా ? పరగడుపునే వాటి నీళ్లను తాగాలి..!
భారతీయులందరి ఇళ్లలోనూ ధనియాలు వంట ఇంటి సామగ్రిలో ఉంటాయి. వీటిని రోజూ వంటల్లో వేస్తుంటారు. ధనియాల పొడిని చాలా మంది వాడుతుంటారు. దీని వల్ల వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే ధనియాల్లో నిజానికి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు వీటిల్లో ఉంటాయి. విటమిన్లు ఎ, సి, కె లు ధనియాల్లో ఉంటాయి. అందువల్ల ధనియాలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ధనియాలను నీటిలో మరిగించి…