దేశంలో కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు.. 509 మంది మృతి..

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,89,583కి చేరుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 509 మంది కోవిడ్ వ‌ల్ల చ‌నిపోగా మొత్తం మ‌ర‌నాల సంఖ్య 4,39,529 కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసుల సంక్య 1.19 శాతం ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 97.48 శాతానికి … Read more

మన శరీరంలో జింక్‌ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా ? జింక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!

మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక మనకు రోజూ ఇది చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. అయితే మన శరీరంలో జింక్‌ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అనేక జీవక్రియలకు జింక్‌ పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్‌ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్‌ ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా … Read more

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్‌ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్‌ 2 – రెండు అర చేతులను … Read more

కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారి అంత సులభంగా పోదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు బలపడి కొత్త కొత్త రూపాల్లో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. అందువల్ల దీన్ని రాకుండా ఉండేందుకు టీకాలను వేసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌ను ఓ జాతికి చెందిన పాము విషం చంపేయగలదని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన కొందరు … Read more

కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

భార‌తీయులు త‌ర‌చూ తాము చేసే అనేక ర‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..! 

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. కిడ్నీల  ఆరోగ్యానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్‌ సి, బి6, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే … Read more

ఈ ఒక్క టానిక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది..!

నిమ్మ‌ర‌సం, అల్లం, వెల్లుల్లి, తేనె.. ఇవ‌న్నీ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్న‌వే. అన్నీ మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఇవ‌న్నీ ప‌నిచేస్తాయి. అయితే వీటితో త‌యారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే చాలు, ఎలాంటి రోగం రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ టానిక్‌ను ఎలా త‌యారు చేయాలంటే..? కావ‌ల్సిన ప‌దార్థాలు నిమ్మ‌కాయ‌లు, పొట్టు తీసిన‌వి … Read more

అనాస పువ్వు గురించి మీకు తెలియని నిజాలు..! ఎన్ని వ్యాధుల‌కు ప‌నిచేస్తుందంటే..?

మన దేశంలో రోజూ ఎన్నో రకాల మసాలా దినుసులను చాలా మంది వాడుతుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్‌ అనీస్‌ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో అద్భుతమైన మసాలా దినుసుగా చెబుతారు. ఎందుకంటే ఇది అనే వ్యాధులను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అందువల్ల అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని … Read more

చికున్ గున్యా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!

చికున్ గున్యా అనేది ఒక వైరస్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. వ‌ర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువ‌గా వ‌స్తుంది. దోమ‌లు ఈ సీజ‌న్‌లో విజృంభిస్తుంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో ఈ వ్యాధి బారిన చాలా మంది ప‌డుతుంటారు. చికున్ గున్యా వ‌స్తే మొద‌ట స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలు ప్రారంభ‌మై త‌రువాత సీరియ‌స్ అవుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జ‌లుబు, జ్వ‌రం, తీవ్ర‌మైన కండ‌రాల నొప్పులు, … Read more

వేరుశెన‌గ‌ల‌ను తిన‌డంలో అనుమానం వ‌ద్దు.. ఈ విధంగా తీసుకోండి..!

వేరుశెన‌గ‌ల‌ను చాలా మంది రోజూ తింటూనే ఉంటారు. వాటితో చ‌ట్నీలు, ప‌చ్చ‌ళ్లు చేసుకుని తింటారు. కొంద‌రు కూర‌ల్లోనూ వాటిని వేస్తుంటారు. అయితే వేరుశెన‌గ‌ల‌ను నేరుగా క‌న్నా నీటిలో నాన‌బెట్టి తింటే ఎంతో మేలు. వాటిని ముందు రోజు రాత్రి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తిన‌వ‌చ్చు. లేదా ఉద‌యం నాన‌బెట్టి సాయంత్రం స్నాక్స్ లా తీసుకోవ‌చ్చు. రోజుకు ఒక క‌ప్పు మోతాదులో వేరుశెన‌గ‌ల‌ను నాన‌బెట్టి తింటే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. 1. వేరుశెన‌గ‌ల్లో అనేక … Read more