శ‌రీర అవ‌య‌వాల‌ను పోలిన ఆహారాలు.. వేటిని తింటే ఏయే అవ‌య‌వాల‌కు ఆరోగ్యం అంటే..?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్ల‌ప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజ‌నల్‌గా ల‌భించే పండ్ల‌తోపాటు అన్ని స‌మ‌యాల్లోనూ ల‌భించే పండ్లు, కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవ‌య‌వాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వాటికి సంబంధించిన ఆహారాల‌ను తీసుకోడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి … Read more

నీటిని త‌గినంత తాగుతున్నారా, లేదా ? ఎలా తెలుసుకోవాలి ? ఈ చిన్న ప‌రీక్ష చేయండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినంత మోతాదులో నీటిని తాగాల‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేస‌విలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గ‌డిపేవారు నీటిని తాగ‌డం మ‌రిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డీహైడ్రేష‌న్ కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే కొంద‌రు నీటిని తాగుతున్నా డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతున్నామ‌ని ఫిర్యాదు … Read more

స‌హ‌జ‌సిద్ధ‌మైన మౌత్ వాష్‌లు ఇవి.. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి..

నోరు ఆరోగ్యంగా ఉండాల‌న్నా, నోరు, దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలన్నా నోటి శుభ్ర‌త‌ను పాటించాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దంతాలు నొప్పి క‌లుగుతాయి. దంత క్ష‌యం వ‌స్తుంది. చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. అలాగే నోటి దుర్వాస‌న వ‌స్తుదంఇ. క‌నుక రోజూ దంతాల‌ను రెండు సార్లు తోముకోవాలి. అలాగే మౌత్ వాష్ ల‌ను కూడా వాడాలి. మౌత్ వాష్‌ల విష‌యానికి వ‌స్తే మార్కెట్‌లో రసాయ‌నాల‌తో త‌యారు చేసే ఎన్నో మౌత్ వాష్‌లు … Read more

ర‌క్తాన్ని స‌హ‌జ‌సిద్ధంగా శుద్ధి చేసుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎన్నో విధులు నిర్వ‌ర్తిస్తుంది. ఆక్సిజ‌న్‌ను, హార్మోన్ల‌ను, చ‌క్కెర‌లు, కొవ్వుల‌ను క‌ణాల‌కు ర‌వాణా చేయ‌డంతోపాటు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు, శ‌రీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ర‌క్తం ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ మ‌నం తినే ఆహారాల‌తోపాటు కాలుష్యం, ఒత్తిడి కార‌ణంగా శ‌రీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. ఈ క్ర‌మంలో వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మ‌న శ‌రీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివ‌ర్ ర‌క్తాన్ని శుద్ధి … Read more

ఆయుర్వేద ప్రకారం శరీరాన్ని అంతర్గతంగా ఇలా శుభ్రం చేసుకోండి..!

నిత్యం మనం తినే ఆహారాలు, పాటించే అలవాట్లు, తిరిగే వాతావరణం వల్ల శరీరంలో మలినాలు చేరుతుంటాయి. అయితే శరీరం తనను తాను అంతర్గతంగా శుభ్రం చేసుకుంటూనే ఉంటుంది. కానీ మలినాలు మరీ ఎక్కువగా పేరుకుపోతే శరీరం కూడా ఏమీ చేయలేదు. కనుక మన శరీరాన్ని మనమే అంతర్గతంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీన్నే డిటాక్సిఫికేషన్‌ అంటారు. ఆయుర్వేద ప్రకారం ఈ ప్రక్రియను శోధన ప్రక్రియ అని పిలుస్తారు. అంటే శరీరంలోని రక్తంతోపాటు పలు ఇతర అవయవాల్లో ఉన్న … Read more

అరోమాథెరపీ ఆయిల్స్‌.. ఏయే నూనెలతో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..?

సాధారణంగా పువ్వులను వాసన చూస్తే మనస్సుకు ఎంతో హాయి కలిగినట్లు అనిపిస్తుంది. పువ్వుల నుంచి వచ్చే సువాసనలను చాలా మంది ఇష్టపడతారు. ఆ వాసనల వల్ల మెదడులోని నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. అందుకనే అరోమా థెరపీ అనే పదం వాడుకలోకి వచ్చింది. అరోమా థెరపీ అంటే పలు రకాల సువాసనలను పీల్చి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడం అన్నమాట. ఈ క్రమంలోనే పలు రకాల ఆయిల్స్‌ను అరోమాథెరపీ కోసం వాడుతుంటారు. అరోమా థెరపీ … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు..

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్స్ శ‌రీరంలో త‌గిన స్థాయిలో ఉండాలి. అయితే మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, పాటించే అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ త‌గ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది దీర్ఘ‌కాలంలో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ప్ర‌తి ఒక్కరూ … Read more

క‌రోనా వైర‌స్‌, టైఫాయిడ్ ల‌క్ష‌ణాలు తెలియక క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా ? తేడాలు తెలుసుకోండి..!

క‌రోనా నేప‌థ్యంలో చాలా మందికి కామన్‌గా ప‌లు ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని అందరికీ తెలిసిందే. కొంద‌రికి అస‌లు ల‌క్ష‌ణాలు ఉండ‌వు. కొంద‌రికి పొడి ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు వంటివి కామ‌న్‌గా ఉంటాయి. అయితే కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న కొద్దీ కొత్త ల‌క్ష‌ణాల‌ను కూడా సైంటిస్టులు ఈ జాబితాలో చేర్చారు. కానీ ప్ర‌స్తుతం చాలా మందికి టైఫాయిడ్ వ‌స్తున్నందున ఏది క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణ‌మో, ఏది టైఫాయిడ్ ల‌క్ష‌ణ‌మో తెలియిక ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రి ఈ రెండింటి మ‌ధ్య ఉండే … Read more

క‌రోనా బాధితులు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు.. వివ‌రాలు వెల్లడించిన కేంద్ర ప్ర‌భుత్వం..

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో, రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం కూడా అంతే అవ‌సరం. మ‌నం రోజూ తినే పలు ఆహారాల వ‌ల్లే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇక కోవిడ్ బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్న వారు కూడా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి కోవిడ్‌పై వేగంగా పోరాటం చేయ‌వ‌చ్చు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం … Read more

త్రిదోషాల్లో ఏయే దోషం ఉన్న‌వారు ఏయే ఆహారాల‌ను తినాలి..?

ఆయుర్వేదం అత్యంత పురాత‌న‌మైన వైద్య విధానం. ఎన్నో వ్యాధుల‌కు ఆయుర్వేదం ప‌రిష్కార మార్గాల‌ను చూపుతుంది. భార‌తీయుల జీవన విధానం ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆయుర్వేదంతో మిళిత‌మై ఉంది. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయుర్వేదంకు అంతటి ప్రాధాన్య‌త ల‌భిస్తున్నందుకు భార‌తీయులు అంద‌రూ గ‌ర్వ‌ప‌డాలి. అయితే మ‌నిషికి అనారోగ్య స‌మ‌స్య‌లు అనేవి వాత‌, పిత్త‌, క‌ఫ దోషాల్లో ఉండే అస‌మ‌తుల్య‌త‌ల వ‌ల్ల వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందువ‌ల్ల ఆయా దోషాల‌ను ఎప్పుడూ స‌మ‌తుల్యంగా ఉంచుకోవాలి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. … Read more