అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

మెడిట‌రేనియ‌న్ డైట్ అంటే ఏమిటి ? ఏమేం తినాలి ? దీని వ‌ల్ల క‌లిగే లాభాలు ?

బ‌రువు త‌గ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌స్తుతం మ‌న‌కు అనేక ర‌కాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెడిట‌రేనియ‌న్ డైట్ కూడా ఒక‌టి. మెడిట‌రేనియ‌న్ స‌ముద్రానికి స‌మీపంలో ఉన్న దేశాలైన ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇట‌లీ, స్పెయిన్ త‌దిత‌ర దేశాల వాసులు ఎక్కువ‌గా ఈ డైట్‌ను పాటిస్తారు. ఈ డైట్‌లో నూనె కోసం ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. మెడిట‌రేనియ‌న్ ప్రాంతాలు క‌నుక దీనికి మెడిట‌రేనియ‌న్ డైట్ అని పేరు వ‌చ్చింది. ఇక మెడిట‌రేనియ‌న్ డైట్‌లో తాజా పండ్లు, కూర‌గాయ‌లు, … Read more

మీకున్న వ్యాధులను బ‌ట్టి ఏయే చిరుధాన్యాల‌ను తినాలో తెలుసుకోండి..!

సిరి ధాన్యాలు.. వీటినే చిరు ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా స‌రే ఇవి మ‌న‌కు అద్భుత‌మైన ఆహార ప‌దార్థాలు అనే చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన పీచు ప‌దార్థం ఉంటుంది. నిత్యం మ‌న‌కు 25 నుంచి 30 గ్రాముల పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) అవ‌స‌రం అవుతుంది. అయితే సిరి ధాన్యాల్లో దేన్ని తిన్నా స‌రే మ‌న‌కు కావ‌ల్సినంత పీచు ప‌దార్థం ల‌భిస్తుంది. అందుక‌నే వీటిని సూప‌ర్ ఫుడ్స్‌గా చెబుతున్నారు. సాధార‌ణంగా వ‌రి, గోధుమ‌ల‌కు పొట్టు తీసే … Read more

జొన్న రొట్టెలు రుచిగా ఉండాలంటే.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

జొన్న‌లు అద్భుత‌మైన ఆహారం. చిరుధాన్యాల్లో వీటికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. వీటిని పిండిగా చేసి ఆ పిండితో రొట్టెలు త‌యారు చేసుకుని తిన‌డం చాలా మందికి అల‌వాటు. అయితే జొన్న రొట్టెల‌ను కింద తెలిపిన విధంగా చేసుకుంటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. సాధారణంగా కేవ‌లం ఒక్క పిండిని మాత్ర‌మే వేసి జొన్న రొట్టెల‌ను త‌యారు చేస్తే కొంద‌రికి తినేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద ఇచ్చిన విధంగా ఆ రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటే దాంతో … Read more

ప‌ల్లి ప‌ట్టీల క‌థ తెలుసా..? వీటికి 100 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంది..!

చిక్కి.. దీన్నే ప‌ల్లి ప‌ట్టీ అంటారు. సాధారణంగా చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ఇండ్ల‌లోనూ వీటిని సులభంగా చేసుకోవ‌చ్చు. భ‌లే రుచిగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని ప‌ల్లి ప‌ట్టీలు అందిస్తాయి. అయితే మీకు తెలుసా..? అస‌లు ప‌ల్లి ప‌ట్టీల క‌థ ఎలా ప్రారంభ‌మైందో.. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌రమైన విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది 1888వ సంవ‌త్స‌రం. అప్ప‌ట్లో భార‌త్‌లో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ముంబైలోని లోనావాల … Read more

ఆయుర్వేదం ప్ర‌కారం నిత్యం 6 రుచుల ఆహారాల‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

ఉగాది పండుగ రోజున స‌హ‌జంగానే చాలా మంది ఆరు రుచుల క‌ల‌యిక‌తో ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి కేవ‌లం ఆ ఒక్క రోజు మాత్ర‌మే కాదు, నిత్యం ఆరు ర‌కాల రుచుల‌కు చెందిన ఆహారాల‌ను ప‌రిమితంగా తీసుకోవాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అవును.. నిత్యం ఆరు ర‌కాల రుచులు ఉండే ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక ఏయే రుచి ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు … Read more

మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!

శ‌రీర మెట‌బాలిజం అనేది కొవ్వును క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెట‌బాలిజం స‌రిగ్గా ఉన్న‌వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంటే.. వారిలో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు లెక్క‌. కానీ కొంద‌రికి మెట‌బాలిజం చాలా త‌క్కువ‌గా ఉంంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెట‌బాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మెట‌బాలిజం అంటే.. మ‌న శ‌రీరం … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవ్వాలంటే మెగ్నిషియం అవ‌స‌రం.. ఇంకా ఏమేం లాభాలు ఉంటాయంటే..?

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. శ‌క్తి అందుతుంది. అలాగే అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. అయితే మిన‌ర‌ల్స్ లో మెగ్నిషియం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల ఇది ఉన్న ఆహారాల‌ను కూడా నిత్యం మ‌నం తీసుకోవాల్సి ఉంటుంది. మెగ్నిషియం ఉప‌యోగాలు మెగ్నిషియం వ‌ల్ల మ‌న శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను స‌రిగ్గా జీర్ణం చేస్తుంది. కండ‌రాలు, నాడులు … Read more

చుండ్రు సమస్యను తగ్గించే 9 చిట్కాలు..!

సాధారణంగా ఎవరైనా సరే తమ శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికి తోడు ఆరోగ్యంగా ఉండాలని కూడా భావిస్తారు. కానీ జుట్టును కాంతివంతంగా కనిపించేలా చేసుకోవడం సులభమే. అయితే చుండ్రు సమస్య ఉంటే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. కనుక ముందు చుండ్రును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… వేపనూనె, ఆలివ్‌ ఆయిల్‌లను … Read more

ఎంత సేపైనా వెక్కిళ్లు ఆగ‌డం లేదా ? ఈ 5 చిట్కాలు పాటించి చూడండి..!

వెక్కిళ్లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. వెక్కిళ్లు వ‌స్తే అస‌లు ఏం చేయాలో అర్థం కాదు. మ‌న‌కు తెలిసిన చికిత్స నీళ్లు తాగ‌డం. గుట‌కలు మింగుతూ నీళ్లు తాగుతాం. దీంతో చాలా వ‌ర‌కు వెక్కిళ్లు త‌గ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు నీటిని తాగినా వెక్కిళ్లు త‌గ్గ‌వు. దీంతో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఎవ‌రికైనా వెక్కిళ్లు ఎందుకు ఏర్ప‌డుతాయి ? అనే విష‌యంపై సైంటిస్టులు ఇప్ప‌టికీ స‌రైన కార‌ణం చెప్ప‌లేదు. కానీ ప‌లు … Read more